English | Telugu
షన్నుపై మాధవీలత సీరియస్.. కోర్టుకి వెళుతుందట
Updated : Dec 9, 2021
బిగ్‌బాస్ కథ క్లైమాక్స్‌కి చేరింది. అయితే ప్రేక్షకుల్లోనూ ఈ షో పట్ల అసహనం కూడా క్లైమాక్స్ వచ్చేసింది. ఇంటి సభ్యుల్లో కొంత మంది వ్యవహరిస్తున్న తీరు... పక్క వారిని స్నేహం పేరుతో తమ అద్దు అదుపుల్లో పెట్టుకోవాలని.. ఒక విధంగా తాము ఆడించే ఆటబొమ్మగా మార్చాలని చేస్తున్న ప్రయత్నాలు.. ప్రేక్షకులకు వెగటు పుట్టిస్తున్నాయి. మరీ ప్రధానంగా షన్ను, సిరిల మధ్య వచ్చే వాద ప్రతి వాదనలు.. షన్ను సిరిని ఏడిపిస్తున్న తీరు ఓ టార్చర్‌లా మారింది.
బిగ్‌బాస్ : సిరి సిగ్గు విడిచి అడిగేసింది!
షన్ను - సిరిల ఎపిసోడ్ బుధవారం మరీ పీక్స్‌కి చేరి ఓ అమ్మాయిని ఓ యువకుడు ఏ రేంజ్ లో టార్చర్ చేస్తున్నాడో సభ్య సమాజానికి అర్థమయ్యేలా చేసింది. దీంతో చాలా మంది షన్నుని టార్గెట్ చేస్తూ అతడి నీచమైన బుద్ధి బయటపడిందంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తనని అదుపుల్లో నువ్వు పెట్టడం ఏంట్రా ఇదీ అంటూ షన్నుపై విరుచుకుపడుతున్నారు. నటి మాధవీ లత అయితే ఏకంగా ఈ టార్చర్ ని నేను తట్టుకోలేను.. ఈ నీచమైన షోని ఆపేయాలని సుప్రీమ్‌కు వెళతానంటూ మండిపడింది.
బిగ్‌బాస్ : విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో తేల్చేశారు
ఫ్రెండ్షిప్ పేరుతో సిరిపై మానసిక అత్యాచారం చేస్తున్నాడని మండిపడింది. స్నేహం పేరుతో హౌజ్‌లో వీరి కామ కలాపాలు చూడలేకపోతున్నాం. కప్‌ని వాడికి తగలేసి వెంటనే బిగ్‌బాస్ హౌజ్‌ని తగలబెట్టేయండి అంటూ ఫైర్ అయింది. హౌజ్‌లో ఈ అరాచకం ఏంటీ.. ఇలాంటి వెధవలకు బిగ్ బాస్ హౌజ్‌లో చోటు కల్పించి సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. ఇలాంటి వాడికి కప్ తగలెడితే బిగ్‌బాస్ కొంపకి నిప్పేట్టేస్తాం.. చివరి ఎపిసోడ్ లో అయినా సరైన నిర్ణయం తీసుకోండి లేదంటే షో పై హై కోర్టుకి, సుప్రీమ్‌కు కూడా వెళతాను అంటూ మాధవీ లత ఫైర్ అవుతోంది.