English | Telugu

అమెరికాలో పచ్చడి మెతుకులతో  కడుపు నింపుకుంటున్న అషు రెడ్డి!


అషు రెడ్డి.. ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. అందాల ఆరబోతకి పెట్టింది పేరు అన్నట్లుగా ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో కనిపించే అషు గురించి చెప్పనక్కరలేదు. యూట్యూబ్ ర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన ఈ హాట్ బ్యూటీ.. బిగ్ బాస్ ఎంట్రీ తో నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టిందనే చెప్పాలి. బిగ్ బాస్ షో తర్వాత అషు వరుస ఆఫర్స్ తో బిజీ బిజీగా ఉంటుంది.

అషు రెడ్డి, పటాస్ హరితో కలిసి కామెడీ స్టార్స్ షోలో చేసింది. కాగా ఆ షోలో హరి ఛాతిమీద అషురెడ్డి టాటూ చూసి అందరూ అవక్కాయ్యారు. దాంతో వాళ్ళద్దరు లవ్ లో ఉన్నట్లుగా అప్పట్లో ఆ న్యూస్ వైరల్ గా మారింది. అయితే తాజాగా ముగిసిన బిబి జోడిలో మెహబూబ్ తో కలిసి జతకట్టిన అషు.. అసలు పర్ఫార్మన్స్ చెయ్యకుండానే షో నుంచి తప్పుకుంది. మెహబూబ్ తో కలిసి డాన్స్ చెయ్యడం ఇష్టం లేకే తప్పుకుందంటూ వార్తలు కూడా వినిపించాయి. ఇఅల అషు ఏదో ఒక విషయం ద్వారా ఎప్పటికప్పుడు వార్తలో నిలుస్తూ.. హాట్ టాపిక్ గా మారుతోంది.

ఆర్జీవి, అషురెడ్డి కాళ్లు పట్టుకున్న వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. చాలా మంది విమర్శకులు విమర్శించడేమో కాకుండా సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి. అలా వైరల్ గా మరి చర్చనీయాంశమైంది అషు రెడ్డి. మరోసారి అషు డేట్ విత్ RGV అంటూ ఒక కాఫీ షాప్ లో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా అషురెడ్డి అమెరికా వెళ్ళింది. అక్కడ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాని షేక్ చేసే హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తుంది ఈ భామ. అంతేకాకుండా తన చిన్ననాట సీనియర్ నటి రోజాతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది అషు. తను అమెరికాకి వెళ్ళి రెండు రోజులు అవుతుందట.. అక్కడ ఆకలి బాధతో ఉంటే.. తన ఫ్రెండ్స్ చికెన్ పచ్చడిలో ఉల్లిపాయలు కట్ చేసి ఇచ్చారట.. ఇప్పుడు అదే తింటూ బతుకుతుందట అషు. మీకు థాంక్స్ మీ గుండె బతకాలిరా అంటూ ఒక వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు కొందరు సో సాడ్, ఎన్ని కష్టాలో అంటూ అషుపై జాలికురిపిస్తూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.