English | Telugu
కృష్ణ ప్లాన్ రివర్స్ అయింది.. ముకుందకి కడుపుమంట!
Updated : May 4, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -147 లో.. భవానికి మురారి కాల్ చేస్తే, ఆమె కాల్ కట్ చేసి నెంబర్ బ్లాక్ లో పెట్టడంతో.. కృష్ణ కోపంతో "ఎందుకు మీ పెద్దమ్మ ఇలా చేస్తుంది.. నేను పెంచాను నేను పెంచానని ఎప్పుడు చెప్తూ ఉంటుంది కదా.. కోపం, ద్వేషంని పెంచుకుంది" అంటూ.. ఆగండి వెళ్లి అడిగేస్తా అని పెద్ద వీరనారిలాగా రెడీ అవుతుంది కృష్ణ. ఆ తర్వాత మీరు కూడా రావొచ్చు కదా అని మురారిని అడుగుతుంది. నువ్వే కదా.. కొంగు బిగించిన ఝాన్సీ లాగా రెడీ అయ్యావ్.. వెళ్ళు అని మురారి అనగానే.. తనకి భవాని గన్ పెట్టిన విషయం గుర్తొచ్చి.. భయపడి వెనక్కి వచ్చి మురారి దగ్గర కూర్చుంటుంది. మీ పెద్దమ్మ గన్ తో కాలుస్తుందని చెప్పగానే.. ఎప్పుడు అలానే ఏం జరగదని మురారి అంటూ.. కృష్ణ భయపడడం చూసి ఇద్దరు నవ్వుకుంటారు. అంతలోనే అటుగా వెళ్తున్న ముకుంద వాళ్ళని చూసి షాక్ అవుతుంది.
వాళ్ళిద్దరు అలా సంతోషంగా ఉండటం చూసిన ముకుంద తట్టుకోలేకపోతుంది. మురారిని కృష్ణ క్షేమించేసినట్టుగా, వాళ్ళిద్దరు అగ్రమెంట్ ని చెరిపేసినట్టుగా.. నిన్ను వదులుకోను ఏసీపీ సర్ అని కృష్ణ, మురారితో అన్నట్లు ఉహించుకుంటుంది ముకుంద. ఆ తర్వాత కృష్ణ, మురారి తలకి ఆయిల్ రాస్తూ.. మనతో ఎవరు మాట్లాడట్లేదు కదా మనకి ఇలా ఉండడం బోర్ గా ఉందని కృష్ణ అనగానే.. ఎటైనా టూర్ వెళ్దామా అని మురారి అంటాడు. టూర్ లేదు ఊరు లేదు.. ఒక కుక్కని పెంచుకుందాం.. దాన్ని వాకింగ్ తీసుకుపోవడం.. అలా దానితో టైం పాస్ చెయ్యొచ్చు.. చిన్న కుక్కని తెచ్చుకుందామని కృష్ణ అనగానే.. ఇప్పటి చిన్న కుక్కనే రేపటి పెద్ద కుక్క అవుతుందని మురారి అంటాడు. అలా డిస్కరేజ్ చెయ్యకండి.. చాలా విషయాల్లో మనుషుల కంటే కుక్కలే బెటర్ అని కృష్ణ అంటుంది. ఇష్టమైన వాళ్ళు మాట్లాడకపోతే ఎలా ఉంటుందో నీకు తెలుసా అని ఈశ్వర్ తో రేవతి అనగా.. మరి కొడుకు చెప్పిన మాట వినకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా అంటూ రేవతితో ఈశ్వర్ అంటాడు. మనకేనా బాధ వాడికి లేదా.. అక్కకి బాలేకపోతే కృష్ణ ట్రీట్మెంట్ చేసింది. అది అర్థం చేసుకోరా అని రేవతి అంటుంది. ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మాకు తెలుసని ఈశ్వర్ అంటాడు. ఆ తర్వాత కృష్ణ ఈవెంట్ ఆర్గనైజర్స్ కి కాల్ చేసి.. డబ్బులు తీసుకొని వెళ్ళండని చెప్తుంది. అలాగే ఈవెంట్ వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి రాగానే.. అదంతా మురారికి తెలుసు కాబట్టి.. మురారి నువ్వు డబ్బులు ఇవ్వు అంటుంది. అలా అయినా భవాని మాట్లాడుతుందని కృష్ణ ప్లాన్.
ఈవెంట్ వాళ్ళు మనీ కోసం ఇంటికి రాగానే.. అంతా మురారికి తెలుసు కదా అని రేవతి అనగానే.. మీకు ఎంత డబ్బులు రావాలో పేపర్ పై రాసి ముకుందకి ఇవ్వండి. ఆ డబ్బులు ఎంతనో అంతకంటే ఎక్కువే ఇచ్చి పంపివ్వమని ముకుందతో భవాని చెప్తుంది. ఈ పెళ్లి నా కూతురుది కాదు.. నేను ఎందుకు ఇవ్వాలి రేవతి.. నీ కొడుకు, కోడలు వాళ్ళ సాలరీ వచ్చాక ఇస్తారో.. ఎప్పుడు ఇస్తారో నీకు ఇవ్వమని రేవతికి చెప్తుంది. అలా భవాని చెప్పాక.. ప్లాన్ ఏంటి ఇలా రివర్స్ అయిందని కృష్ణ అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.