English | Telugu

కృష్ణ ముకుంద మురారీలో కొత్త ట్విస్ట్.. కృష్ణకి నిజం తెలిసిపోతుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -261 లో.. ఆదర్శ్ ని ఎలాగైనా ఇంటికి తీసుకొని వస్తానని భవానికి మురారి మాటిస్తాడు. మరొకవైపు కృష్ణ కోసం మురారి ఇల్లంతా వెతుకుతుంటాడు. ఎంత వెతికినా ఎక్కడ చూసిన కృష్ణ కన్పించదు. రేవతి చూసి వచ్చి కూడ కృష్ణ లేదని చెప్తుంది.

ఆ తర్వాత అలేఖ్య వచ్చి కృష్ణ, ముకుంద ఇద్దరు బయటకు వెళ్లారని చెప్తుంది. ఆ తర్వాత మురారి ఫోన్ చేస్తానని చెప్పి కృష్ణ కు ఫోన్ చేస్తాడు. తన ఫోన్ స్విచాఫ్ అని వస్తుంది. కృష్ణకి ముకుంద నిజం చెప్తుందేమోనని మురారీతో రేవతి అంటుంది. నీకేమైనా తెలుసా అని అలేఖ్యని రేవతి అడుగుతుంది. నాకేం తెలియదని అలేఖ్య కవర్ చేస్తుంది. ఆ తర్వాత అలేఖ్య మధు దగ్గరకి వెళ్లి మాట్లాడుతుంది. మరొక వైపు ముకుంద, కృష్ణ ఇద్దరు ఒక దగ్గరకి వెళ్తారు. ఏంటి ముకుంద చెప్పు టాప్ సీక్రెట్ అంటూ.. నా ఫోన్ కూడా స్విచాఫ్ చేసావేంటని ముకుందని కృష్ణ అడుగుతుంది. నువ్వు మురారి ప్రేమించిన అమ్మాయి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నావు కదా అని అనగానే.. అవును నీకు తెలుసా అని కృష్ణ అడుగుతుంది. తెలియడం కాదు నా క్లోజ్ ఫ్రెండ్ అని ముకుంద చెప్పగానే.. ఎక్కడ ఉంటుంది‌. పెళ్లి అయిందా? ఇంకా తను ఏసీపీ సర్ నే ప్రేమిస్తుందా అంటూ కృష్ణ ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. రాధకి పెళ్లి అయింది కానీ ఇంకా మురారీనే ప్రేమిస్తుందని, " నీ ప్రేమ కంటే కూడా రాధ ప్రేమ గొప్పది. తన ప్రేమించిన వాడిని త్యాగం చేసింది" అని తన గురించి తానే గొప్పగా కృష్ణతో ముకుంద చెప్తుంది. తనకంటే నా ప్రేమ గొప్పది. ఎవరి కోసమో తను ప్రేమించిన వాడిని వదులుకుంటే గొప్ప ప్రేమ ఎలా అవుతుంది. మురారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని కృష్ణ అంటుంది.

ఆ తర్వాత రాధ చాలా బాధపడుతుంది. మురారి కోసం, రాధ కోసం అయిన నీ ప్రేమని త్యాగం చేయ్ కృష్ణ అని ముకుంద అనగానే.. నువ్వు ఇంకొకసారి అలా అనకు మురారిని వదులుకునేది లేదు. మీ ఫ్రెండ్ రాధకి చెప్పు ఇంకొకసారి ఇలాంటి ఆలోచనని, ప్రపోజల్ ని తీసుకొని రావొద్దని నీక్కూడా చెప్తున్నాను‌. ఇంకొకసారి ఇలా మాట్లాడకు ముకుంద అని కృష్ణ గట్టిగనే వార్నింగ్ ఇస్తుంది. ముకుంద సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.