English | Telugu

Krishna Mukunda Murari: వాళ్ళు ఆడే నాటకానికి రేపటితో ముగింపు.. పార్టీలో ఊహించని ట్విస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-459 లో.. కృష్ణ, మురారీ ఇద్దరు హాస్పిటల్ నుండి ఇంటికి బయల్దేరతారు. దారిలో వారికి ఓ ముసలావిడ కనిపిస్తుంది. మండుటెండలో మామిడికాయలు అమ్ముకునే ముసాలివడని చూసిన కృష్ణ, మురారీ చలించిపోతారు. ఇక ఆమె దగ్గరికి వెళ్ళి కొంత డబ్బిచ్చి, మామిడికాయలు తీసుకొని ఇంటికి బయల్దేరతారు.

ఇక వారిద్దరు ఇంటికి రాగానే.. భవాని, రేవతి చూసి సంబరపడిపోతారు. ఇక కృష్ణ దగ్గరకి భవాని వచ్చి ముద్దులుపెడుతుంది. మీరు మాకు సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు. కానీ మేమే ఇలా పార్టీ ఏర్పాటు చేసి మీకు సర్ ప్రైజ్ ఇస్తున్నాం.. అయినా నువ్వు తెచ్చుకున్న మామిడికాయలే చెబుతున్నాయి నువ్వు తల్లివి కాబోతున్నావని.. వెళ్లండి.. వెళ్లి రెడీ అయ్యి రండి అంటు ఇద్దరిని భవాని పైకి పంపిస్తుంది. అది కాదు పెద్దత్తయ్యా అని కృష్ణ చెప్పే ప్రయత్నం చేసిన.. భవాని వినిపించుకోదు. ఇక కృష్ణ, మురారి ఇద్దరు ఎమోషనల్ అవుతారు. గదిలోకి వెళ్ళి కృష్ణ, మురారి ఏడుస్తుంటే గుండె పగిలిపోతుంది‌. ఇక మీరా సంతోషంలో అటువైపుగా వెళ్తుంటే ఆదర్శ్ చూస్తాడు. ఏంటి ఇంత సంతోషంగా ఉన్నారని మీరాని ఆదర్శ్ అడుగగా.. అదేం లేదని, ఇంట్లో ఈ పార్టీ ఏంటని అంటుంది. అదా.. ఆవిడ గారు నెల తప్పారంట. ఈలోకంలో తల్లే కానట్లు మా అమ్మ అందరినీ పిలిపించి ఇక్కడ అందరికీ పార్టీ ఇస్తోందని ఆదర్శ్ అంటాడు. అంటే అక్కడ సరోగసి అని చెప్పి, ఇక్కడ కడుపు నాటకం ఆడుతున్నారా.. ఈ నాటకం ఎంత కాలం ఆడతారో ఏమో నేను చూస్తానని మీరా అనుకుంటుంది.

ఆదర్శ్ గారు.. అయిన కృష్ణ ఎలాంటిది అన్నది మనకు తెలుసు.. ఇంట్లో వాళ్లందరి ముందు కృష్ణ మంచిది కదా.. తనని మాటలు అని మీరు చెడ్డవారు కాకండి అని మీరా చెప్పేసి వెళ్ళిపోతుంది. అయితే తరువాయి భాగంలో కృష్ణకు పూల దండలు వేసి అందరు గ్రాంఢ్ గా ఏర్పాట్లు చేసి పార్టీ చేసుకుంటారు‌ ఇంతలో ఒకమ్మాయి వచ్చి.. ఇక్కడ సరోగసి మదర్ కావాలన్నారట ఎవరు అని భవానీతో సహా అందరి ముందు అడుగుతుంది. దాంతో కృష్ణ ఒక్కసారిగా కూర్చీలోంచి పైకి లేస్తుంది. అప్పుడే మీరా అలియాస్ ముకుంద నవ్వుతుంది. మరి మీరా అనుకున్నది నెరవేరుతుందా? అసలు ఆమెని పంపిందెవరు? తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.