English | Telugu
Krishna Mukunda Murari : ఇప్పటికీ ఎప్పటికి మురారీనే నా భర్త.. చెంపచెల్లుమనిపించిన కృష్ణ!
Updated : Mar 12, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -415 లో.. ఆదర్శ్ నువ్వు అంటే ఇష్టం లేదు.. నా మనసులో ఇప్పుడు ఎప్పుడు మురారీకి మాత్రమే స్థానం ఉందని ముకుంద చెప్పడంతో ఆదర్శ కోపంగా బయటకు వచ్చి మురారిని పిలుస్తాడు. నా భార్యకి నేను అంటే ఇష్టం లేదట.. నువ్వు అంటేనే ఇష్టమట మాయమాటలు చెప్పి నన్ను తీసుకొని వచ్చారని కృష్ణ, మురారీలపై ఆదర్శ్ అరుస్తాడు.
నా భార్యకి నేను అవసరం లేదట.. నువ్వే కావాలట.. వెళ్లి నా భార్యని సంతోషపెట్టు అని ఆదర్శ్ అనగానే.. ఆదర్శ్ చెంప చెల్లుమనిపిస్తాడు మురారి. నువ్వేం అంటున్నావో అర్థం కావట్లేదని రేవతి అనగానే.. ఇవన్నీ ముకుందే స్వయంగా నాతో చెప్పిన మాటలు.. మీకు చెప్తున్నానని ఆదర్శ్ అంటాడు. నేను వెళ్లి ముకుందని తీసుకొని వస్తానని ముకుంద దగ్గరికి కృష్ణ వెళ్తుంది. రా ముకుంద అంటు కృష్ణ లాక్కొని వెళ్తుంది. ఆదర్శ్ చెప్పేది అబద్ధమని చెప్పు ముకుంద అని రేవతి అనగానే.. నిజమే నాకు ఆదర్శ్ అంటే ఇష్టం లేదు. నా మనసులో ఉన్నది మురారి మాత్రమే అని ముకుంద అనగానే అందరూ షాక్ అవుతారు. నేను ఎప్పుడైన నాకు ఆదర్శ్ ఇష్టం తీసుకొని రమ్మని చెప్పానా అసలు ఎప్పుడు అయిన తనతో క్లోజ్ గా ఉన్నానా అంటూ ముకుంద తన మనసులో ఉన్న మాటలు బయట పెడుతుంది. ఇందులో ముకంద తప్పేం లేదు. మొత్తం తప్పు కృష్ణ మురారీలదే.. వాల్లే నన్ను తీసుకొని వచ్చారని ఆదర్శ్ అంటాడు.
ఆ తర్వాత మురారీని మనసులో పెట్టుకుని వేరొకరితో క్లోజ్ గా ఉండలేను.. ఇప్పుడు ఎప్పుడు మురారి నా సొంతమని ముకుంద అనగానే ముకుంద చెంపపై కృష్ణ ఒక్కటిస్తుంది. నీ భర్త ఎదురుగా ఉన్నాడు.. అలాగేనడ మాట్లాడేదంటు కృష్ణ కోప్పడుతుంది. తరువాయి భాగంలో సిగ్గు, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా అని ముకుందని కృష్ణ అనగానే.. ముకుంద కోపంగా చెయ్యి ఎత్తుతుంది. నీకు పౌరుషం కూడానా అని కృష్ణ అంటుంది. ముకుందని ఎందుకు అలా అన్నానని అనుకునే రోజు వస్తుందని కృష్ణతో ముకుంద చెప్పి వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత ఆదర్శ్ వెళ్లిపోతుంటే మధు మురారి ఇద్దరు కలిసి ఆపుతారు. ముకుంద వెళ్లిపోవడానికి నేను వెళ్లిపోవడానికి కారణం కృష్ణేనని ఆదర్శ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.