English | Telugu

Krishna Mukunda Murari : శోభనం చెడగొట్టాలని ప్రయత్నిస్తున్న ముకుంద.. వాళ్ళు నిజం చెప్పేస్తారా! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -410 లో.. గుడిలో కాయిన్ నిల్చొపెడితే అనుకున్న కోరిక నెరవేరుతుందని రేవతి చెప్పగానే.. నేను నిల్చోపెడతా అని మురారి దగ్గర ముకుంద కాయిన్ తీసుకొని ట్రై చేస్తుంది. ఇక అక్కడే ఉన్న కృష్ణ కూడా.. మనం కూడా కాయిన్ నిల్చొపెట్టి తన కోరిక నెరవేరదని నిరూపించాలని అంటుంది. ఆ తర్వాత కృష్ణ కూడా ట్రై చేస్తుంటుంది.

ఆ తర్వాత ముకుంద కాయిన్ నిల్చొని ఉంటుంది. దాంతో ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతూ నా కోరిక నెరవేరుతుంది. నువ్వు కోరిక నెరవేరేది కోరుకో.. అప్పుడే నిల్చుని ఉంటుందని కృష్ణకి ముకుంద చెప్పగానే‌. కృష్ణ నిరాశ చెందుతుంది. ముకుంద కోరిక నెరవేరతుందంట అంటే మీరు ముకుంద సొంతం అవుతారా అని మురారితో కృష్ణ అనగానే.. అలా ఏం లేదు నేను ఆల్రెడీ ఎప్పుడో నీ సొంతం అయ్యానని మురారి అంటాడు. ఆ తర్వాత మురారి అసలు కాయిన్ ఎలా నిలబడిందని ఆలోచిస్తుంటే అప్పుడే ముకుంద వచ్చి చూసావా నా కోరిక నెరవేరుతుందని అంటుంది. అలా తను అనగానే.. ఒకసారి అటు చూడు కాయిన్ కింద పడిందని మురారి అంటాడు. అది చూసి ముకుంద షాక్ అవుతుంది. నీ కోరిక తీరదని మురారి అనగానే నేను చెయ్యాలని అనుకున్నది చెయ్యడం కోసం ఎంత దూరమైన వెళ్తానని ముకుంద అంటుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి ఇద్దరు కారులో వెళ్తు కూడా ఆ విషయం గురించే మాట్లాడుకుంటారు.

ఆ తర్వాత ముకుంద , ఆదర్శ్ ఇద్దరు ఇంటికి వస్తారు. ఆదర్శ్ కి నడవ రావట్లేదు కదా.. నువ్వు కొంచెం తీసుకొని వెళ్లొచ్చు కదా అని రేవతి అంటుంది. పర్లేదని ఆదర్శ్ అంటాడు. మరొకవైపు కృష్ణ, మురారి ఇద్దరు రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ వెయిటర్ తన స్టోరీ చెప్తూ.. నా భార్య శోభనం గదిలో నుండి వెళ్ళిపోయిందని చెప్తాడు. దాంతో ముకుంద కూడా అలాగే వెళ్ళిపోతుందేమోనని ఇద్దరు టెన్షన్ పడతారు. ఆ తర్వాత ఇద్దరు టెన్షన్ గా ఇంటికి వస్తే.. ఏమైందని రేవతి అడుగుతుంది. మీ అబ్బాయి కొట్టాడని కృష్ణ అనగానే మురారి ఆశ్చర్యంగా చూస్తాడు. తరువాయి భాగంలో ముకుంద శోభనం ఎలా చెడగొట్టాలని ఆలోచిస్తు ఉంటుంది. మరొకవైపు కృష్ణ, మురారి ఇద్దరు ఆదర్శ్ కి ముకుంద గురించి నిజం చెప్పాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.