English | Telugu
Krishna Mukunda Murari:కోనేరులో పడిపోయిన కృష్ణ.. మురారికి గతం గుర్తొచ్చేనా?
Updated : Dec 12, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -338 లో.. కృష్ణ ఒకవైపు మురారి, ముకుందలు ఒక వైపు తులసి పూజా చేస్తుంటారు. కృష్ణ, మురారి దూరంగా ఉన్న.. పక్కన ఉన్నట్టు ఫీల్ అయి మురారిని చూస్తూ పూజ చేస్తుంటుంది కృష్ణ. అటువైపు మురారి పక్కన ముకుంద ఉన్న కూడా పట్టించుకోడు. దాంతో ముకుంద డిస్సపాయింట్ అవుతుంది.
ఆ తర్వాత భవాని దగ్గరికి ముకుంద వస్తుంది. పూజ అయిపొయిందా అని అనగానే ముకుంద చిరాకుగా చెప్పడం తో ఏమైందని అడుగుతుంది. దాంతో ముకుంద పూజ దగ్గర జరిగింది చెప్తుంది. నీది తప్పు కాదు. నాది తప్పు అసలు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక వాళ్ళని ఇక్కడి వరకు రానివ్వకుండా ఉంటే, ఇక్కడి వరకు వచ్చేది కాదని భవాని అంటుంది. ఆ తర్వాత కృష్ణకి మీపై చాలా గౌరవం అందుకే ఇప్పుటి వరకు నిజం చెప్పకుండా ఆగింది. నిన్ను రాత్రి కూడా కృష్ణ భర్త ఎవరని అందరిని అడిగి కోపంగా కృష్ణ దగ్గరికి వెళ్లి అడిగాడు కృష్ణ. అప్పుడు కూడా నిజం చెప్పలేదు. చెప్తే ఇంట్లో వేరేలా ఉండేదని ముకుంద అనగానే.. కృష్ణ అంత మోసం చేసిన తన గురించి పాజిటివ్ గా చెప్తున్నావ్. అది నాకు బాగా నచ్చింది. మురారికి కాబోయే భార్యకి ఉండే అర్హత నీకు ఉందని ముకుందతో భవాని అంటుంది. మురారికి పెళ్లి చేస్తానని భవాని చెప్పగానే ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు కృష్ణ దగ్గరికి మురారి ఆపిల్ ముక్కలు, చట్నీ తీసుకోని వస్తాడు. అది చూసి మురారికి గతం గుర్తుకు వస్తుందని కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఆ తర్వాత అందరు గుడికి వస్తారు. కృష్ణ కూడా వస్తుంది. ముకుంద, భవాని తప్ప అందరూ కృష్ణతో సరదాగా మాట్లాడుతుంటే.. చూడండి అందరూ కృష్ణతో ఎలా సరదాగా ఉన్నారో అని ముకుంద అంటుంది. వాళ్ళ దగ్గరికి భవాని వెళ్లి.. అందరు రండి ఒక కృష్ణ తప్ప అంటుంది. దాంతో అందరు వెళ్ళిపోతారు కృష్ణ ఒక్కతే ఉందని బాధపడుతు ఉంటుంది. మరొక వైపు ముకుంద మురారి ఇద్దరు పూజ చేస్తుంటారు. అది చూడలేక నందు, మధు ఇద్దరు కృష్ణ దగ్గరికి వస్తారు. నిన్న రాత్రి నీ భర్త ఎవరని మురారి అడిగినప్పుడు.. ఏమని చెప్పావ్ అని నందు అడుగుతుంది. గతం గుర్తుక వస్తే నా భర్త ఎవరో తెలుస్తుందని చెప్పానని నందుకి కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత మీ ఈడు గల మూత్తయిదువులతో కంకనాలు కట్టించాలని పంతులు చెప్తాడు. ఎవరు.. ఉన్నారని భవాని అనగానే కృష్ణ ఉంది కాదా అని మురారి అంటాడు. తరువాయి భాగంలో.. కృష్ణ, ముకుంద ఇద్దరు మాట్లాడుకుంటు ఉండగా కృష్ణ కోనేరులో పడిపోతుంది. ఏసీపీ సర్ కాపాడండని కృష్ణ అరుస్తుంటే.. మురారికి గతం గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.