English | Telugu

కృష్ణ, మురారి కలిసుండాలని హోమం చేపిస్తున్న రేవతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -182 లో.. నాపై మురారి చూపించే ప్రేమ త్యాగం మాత్రమే, నా స్థానంలో ఎవరున్నా ఏసీపీ సర్ అలాగే చేసేవారు. మా నాన్నకి ఇచ్చిన మాట కోసం మాత్రమే ఏసీపీ సర్ పెళ్లి చేసుకున్నాడని కృష్ణ తన మనసులో అనుకుంటుంది.

మరొకవైపు అలేఖ్య, మధు హాల్లో కూర్చుని ఉంటారు. అప్పుడే ముకుంద కిందకి వస్తుంది. కృష్ణ కాలికి మురారి మెట్టెలు తొడిగాడట కదా అని అలేఖ్య ముకుందతో అంటుంది. కృష్ణ భార్య కాబట్టి మురారి మెట్టెలు తొడిగాడని మధు అంటాడు. ముకుంద మాత్రం సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత నువ్వు ఎవరినైనా ప్రేమించావా ముకుంద అని అలేఖ్య అడుగుతుంది. ఇదేంటి కావాలని అడుగుతుందా.. ఇప్పటికే నోరు జారి రేవతి అత్తయ్యకి నిజం చెపితే నాతో ఆడుకుంటుందని ముకుంద మనసులో అనుకుని.. నేను చదువుకోవడానికి వెళ్ళాను.. లవ్ చేసేంత టైమ్ నాకు లేదని అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరి మురారిని లవ్ చేసేంత టైమ్ ఉందా అని అలేఖ్య అనుకుంటుంది.

ఆ తర్వాత రేవతి, మధు దగ్గరికి వెళ్లి పంతులిని పిలుచుకొనిరా అని చెప్తుంది. కాసేపటికి మురారికి రేవతి కాల్ చేసి ఇంట్లో హోమం చేస్తున్నాం.. నువ్వు, కృష్ణ పూజలో కూర్చోవాలి. దానికి సంబంధించిన లిస్ట్ పంపిస్తున్నాను. మీరిద్దరూ తీసుకొని రావాలని రేవతి చెప్తుంది. దానికి మురారి సరే అంటాడు. ఏమైంది ఏసీపీ సర్ అని కృష్ణ అడుగుతుంది. ఇంట్లో హోమం చేస్తారట, అది కూడా మనమే చెయ్యాలని మమ్మీ చెప్పిందని కృష్ణతో మురారి అంటాడు. ఎందుకో అత్తయ్య నాలుగు రోజుల నుండి వింతగా ప్రవర్తిస్తున్నారని కృష్ణ అంటుంది. మమ్మీకి మన గురించి తెలిసిందని ఎలా చెప్పాలి కృష్ణ అని మురారి తనలో తానే అనుకుంటాడు.

మరొకవైపు పంతులు గారు ఇంటికి వచ్చి.. ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతాడు. అప్పుడే మురారి ఇంటికి వస్తాడు. మురారి కూర్చొని ఉండగా, కృష్ణ నిల్చొని ఉంటుంది. దంపతులిద్దరు దూరం దూరం ఉన్నారు అందుకేనా ఈ హోమం అని పంతులు అంటాడు. అదేం లేదు మీరు వాళ్ళిద్దరని ఆశీర్వదించండని రేవతి అనగానే.. కృష్ణ, మురారి ఇద్దరు పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత కృష్ణ, మురారి హోమం గురించి ఆలోచిస్తుంటారు.

హోమం ఎలా ఆపాలని మురారి అనగానే.. హోమం ఎందుకు ఆపాలని చూస్తున్నారు, అయినా తన మనసులో వేరే అమ్మాయి ఉంది కదా.. నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు ఏసీపీ సర్ తో ఎక్కువ జ్ఞాపకాలు ఉండేలా చేసుకుంటానని కృష్ణ అనుకుంటుంది. నాకే ఒంట్లో బాలేదని రేవతి అత్తయ్యకి చెప్పి హోమం ఆగేలా చెయ్యాలా అని కృష్ణ అనగానే.. కృష్ణ మనసులో నేను లేను కనుకే ఇలా అంటుందని మురారి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.