Read more!

English | Telugu

రాజ్ కి తెలియకుండా కావ్య చేస్తున్న డిజైన్స్.. స్వప్నకి కొత్త ఆఫర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -149 లో.. కావ్య తన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ గా ఎలా హెల్ప్ చెయ్యాలని ఆలోచిస్తుంటుంది. ఆ తర్వాత శృతికి ఫోన్ చేస్తుంది కావ్య. మేడం నేనే మీకు చేద్దాం అనుకున్నా మీరే చేశారని శృతి అంటుంది. అవునా నాకు ఎందుకు చెయ్యాలనుకున్నావని కావ్య అడుగుతుంది. మా బాస్ కి మీరు వేసిన డిజైన్స్ నచ్చుతున్నాయి మేడమ్ అని శృతి అంటుంది. 

అయితే ఇక నుండి డిజైన్స్ నేను వేసి పంపిస్తాను. ఈ విషయం మీ బాస్ కి తెలియవద్దని కావ్య అంటుంది. సరే అని శృతి అంటుంది. నాకు డిజైన్స్ వేసినందుకు కొంత డబ్బు కావాలని కావ్య అనగానే.. సరేనని శృతి అంటుంది. అయినా మీరు కోటిశ్వరుల ఇంటికి కోడలు కదా? మీకు డబ్బు అవసరం ఏం ఉందని శృతి అంటుంది. మా ఫ్యామిలీ కి ఫైనాన్సియల్ గా సపోర్ట్ చెయ్యడానికి, మా వారిని అడిగితే ఇస్తారు కానీ నా కష్టంతో హెల్ప్ చెయ్యాలనుకుంటున్నట్టు కావ్య చెబుతుంది. ఇప్పుడు డిజైన్స్ పంపించు నేను వేస్తానని శృతితో కావ్య అంటుంది. ఆ తర్వాత రాజ్ నిద్రపోయాక కావ్య బయటకు వచ్చి డిజైన్స్ వేస్తుంది. రాజ్ లేచేసరికి గదిలో లేకపోయేసరికి రాజ్ బయటకు వస్తాడు. రాజ్ ని గమనించిన కావ్య.. డిజైన్ దాచిపెట్టి ముగ్గులు వేస్తుంది. రాజ్ వచ్చి ముగ్గు చూసి ఇది ఇక్కడ కూర్చొని వెయ్యాలా? లోపలికి రా అని చెప్పి వెళ్ళిపోతాడు. 

మరొక వైపు కళ్యాణ్ నిజంగానే బాధపడ్డాడా అని అప్పు ఆలోచిస్తుంటుంది. ఒకసారి ఫోన్ చేద్దామని కళ్యాణ్ కి మిస్డ్ కాల్ ఇస్తుంది అప్పు. అలా అప్పు మిస్ట్ కాల్ చూసిన కళ్యాణ్.. నేను ఎందుకు చెయ్యాలి.. అప్పు చేసేదాకా వెయిట్ చేద్దామని అనుకుంటాడు. మిస్డ్ కాల్ ఇస్తే చెయ్యవా అని కోపంగా కళ్యాణ్ కి ఫోన్ చేస్తుంది అప్పు. మిస్డ్ కాల్ ఇస్తే చేస్తలేవ్ అని కోపంగా మాట్లాడేసరికి.. కళ్యాణ్ సారీ చెప్తాడు. సరే గాని రేపు ప్రాక్టీస్ కి త్వరగా రా అని చెప్పి అప్పు ఫోన్ కట్ చేస్తుంది. తను తిట్టింది కదా తను సారీ చెప్పాలి కదా.. నాతో సారీ చెప్పించుకుందేంటని కళ్యాణ్ అనుకుంటాడు.

మరొకవైపు తాను మోడలింగ్ కి సెలెక్ట్ అయిన విషయం స్వప్నకి తెలుస్తుంది. ఆ విషయం రాహుల్ రాగానే తన హ్యాపీ నెస్ ని షేర్ చేసుకుంటుంది. నేను సెలబ్రిటీ అయిపోయిన తర్వాత మన దగ్గర డబ్బులు చాలా ఉంటాయంటూ రాహుల్ తో అంటుంది స్వప్న. మరొక వైపు కావ్య డిజైన్స్ ని శృతికి పంపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.