Read more!

English | Telugu

విశ్వనాథ్ ఇంటికి వచ్చిన ఆత్మీయ అతిథులు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -816 లో.. కాలేజీలో సెమినార్ తర్వాత ఇంటికి వచ్చిన విశ్వనాథ్.. ఇది నీ మొదటి సెమినారేనా అని అడుగుతాడు. దాంతో అక్కడే ఉన్న వసుధార.. DBST కాలేజీ తరుపున రిషి ఇచ్చిన సెమినార్ లను గుర్తుచేసుకుంటుంది. మన కాలేజీకి మనం రిక్వెస్ట్ చేస్తేనే వెళ్ళడు. అలాంటిది రిషి ఇదివరకు వేరే కాలేజీలో ఎలా చెప్తాడని ఏంజిల్ అంటుంది. ఆ తర్వాత జగతి ఇచ్చిన బొకేని వేరే దగ్గర పెట్టండని రిషి అంటాడు. ఇంతమంచి బొకేని పక్కన పెట్టమంటున్నావ్.. దీంతో ఒక సెల్ఫీ తీసుకుందామని ఏంజిల్ అంటుంది. దాంతో అందరూ కలిసి సెల్ఫీ తీసుకుంటారు. 

మరొక వైపు శైలేంద్ర ఇంటికి వెళ్లి దేవయానికి కాలేజీలో జరిగిందంతా చెప్తాడు. రిషి బ్రతికే ఉన్నాడని శైలేంద్ర చెప్పగానే.. దేవయాని షాక్ అవుతుంది. అసలు పిన్ని బాబాయ్ లు ప్లాన్ ప్రకారమే కాలేజీకి వెళ్లారని శైలేంద్ర చెప్తాడు. మరి రిషి వాళ్లతో మాట్లాడాడా అని దేవయాని అడుగుతుంది. లేదు పిన్ని, బాబాయ్ మాట్లాడుదామని ట్రై చేసినా రిషి మాట్లాడలేదు. వసుధార కూడా అక్కడే ఉందని శైలేంద్ర చెప్తాడు. రిషిని చంపేస్తానని శైలేంద్ర అనగానే.. నువ్వు తొందరపడకని దేవయాని చెప్తుంది. 

మరొకవైపు వసుధార నీకొక సర్ ప్రైజ్ అని ఏంజెల్ అంటుంది. ఏంటని వసుధార అనగానే.. కొద్దిసేపు ఆగితే నీకే తెలుస్తుందని ఏంజిల్ అంటుంది. విశ్వనాథ్, రిషి ఇద్దరు హాల్లో ఉంటారు. అప్పుడే జగతి, మహేంద్ర వాళ్ళు.. విశ్వనాథ్ ఇంటికి వస్తారు. జగతి మహేంద్ర లు రిషి ని చూస్తూ ఇబ్బంది పడుతూనే ఇంట్లోకి వస్తారు. సర్ ప్రైజ్ అని చెప్పాను కదా వాళ్లే అని జగతి, మహేంద్రలను చూపిస్తూ.‌. వసుధారతో ఏంజిల్ చెప్తుంది. బయట మూడు రోజులు ఎక్కడో ఉండడం ఎందుకని నేనే పిలిచానని విశ్వనాథ్ అంటాడు.

ఆ తర్వాత జగతి, మహేంద్రలు వసుధారని చూసాక.. ఇక్కడ ఉందేంటని అనుకుంటారు. మీ ఆత్మీయులను ఇలా కలవడం ఎలా ఉందని, నీకు తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడవా అని ఏంజిల్ అంటుంది. ఆ తర్వాత జగతి, మహేంద్ర ఇద్దరికి వాళ్ళ గది చూపించమని ఏంజిల్ కి విశ్వనాథ్ చెప్పి వెళ్ళిపోతాడు. రిషి.. నీ రూమ్ ఎక్కడ అని మహేంద్ర అనగానే.. పదా డాడ్ చూపిస్తానని రిషి అంటాడు. డాడ్ అన్నావేంటని ఏంజిల్ షాక్ అవుతుంది.. నేను అనలేదని రిషి అంటాడు. అక్కడే ఉన్న జగతి, మహేంద్ర, వసుధారలు కూడా డాడ్ అనలేదని  ఏంజిల్ కి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.