Read more!

English | Telugu

ఆమె పర్సనల్ వీడియో షేర్ చేయాల్సిన అవసరం లేదు అన్న సింగర్ చిన్మయి

సోషల్ మీడియాలో కొంతమంది ఫైర్ బ్రాండ్స్ ఉంటారు. ముఖం మీద కొట్టినట్టు మాట్లాడతారు. అలాంటి వారిలో నటి కస్తూరి శంకర్, సింగర్ చిన్మయి శ్రీపాద కూడా ఉన్నారు. మరి ఇలాంటి ఫైర్ బ్రాండ్స్ మధ్యన ఫైట్ ఐతే ఎలా ఉంటుందో తెలుసా..ఇలా ఉంటుంది. కస్తూరి రీసెంట్ గా తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ అమ్మాయి పర్సనల్ వీడియోని కస్తూరి ఇలా షేర్ చేసేసరికి నెటిజన్స్ కూడా ఫుల్ ఫైర్ అవుతున్నారు. మరో ఫైర్ బ్రాండ్ సింగర్ చిన్మయి కూడా రిప్లై ట్వీట్ ఇచ్చారు.  ఒక మద్యం షాపులో ఇద్దరమ్మాయిలు మందు కొంటున్నట్టుగా ఉన్న ఈ వీడియోని ఆమె తన ట్విట్టర్ లో షేర్ చేశారు కస్తూరి. "తాగండి అమ్మాయిలు తాగండి...ఎనిమిది మందిలో ఈమె మాత్రమే మగరాయుడు. వాట్సాప్ లో ఫార్వార్డ్ మెసేజ్ గా వచ్చింది.

సూపర్...మహిళలు కూడా హక్కులొచ్చేశాయి" అంటూ ట్వీట్ పెట్టారు. ఇక వీడియో ఎండింగ్ లో పాపం ఆ అమ్మాయి ముఖానికి చున్నీ అడ్డుపెట్టుకుని పారిపోయింది. ఇక కస్తూరి ఏ ఉద్దేశంతో ఈ వీడియోని పోస్ట్ చేసిందో తెలీదు కానీ ఆమె పెట్టిన పోస్ట్, కామెంట్ మాత్రం గురి తప్పు నెటిజన్స్ ఆగ్రహానికి గురయ్యింది. ఇంతకూ వాళ్ళు చేసిన దాన్ని సమర్దిస్తున్నావా ? వ్యతిరేకిస్తున్నావా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఇష్టం , వాళ్ళ లివర్ ? మీకేంటి ? అంటూ కస్తూరి ఒక బార్ ఉన్నట్టుగా ఒక న్యూస్ క్లిప్పింగ్ ని పోస్ట్ చేసేసరికి ఆ నెటిజన్ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాను అని వార్నింగ్ ఇచ్చింది. ఇక నెటిజన్స్ తో పాటు సింగర్ చిన్మయి శ్రీపాద కూడా ట్వీట్ కి రిప్లై ఇచ్చేసారు. "నిజాయితీగా చెప్తున్నా.. కస్తూరి నువ్వు ఇలా షేర్ చేయాల్సిన అవసరం లేదు" అన్నారు. దీంతో సింగర్ చిన్మయికి మద్దతుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఐనా ఈ వీడియో మూడేళ్ళ క్రితం నాటిది...ఇప్పుడు పోస్ట్ చేసి ఏం చేద్దామని అంటూ మరో నెటిజన్ అడుగుతున్నారు. వీడియో షేర్ చేయడం ఏమో కానీ కస్తూరి శంకర్ మాత్రం నెటిజన్స్ తో బాగా తలంటించుకున్నారు.