English | Telugu

Karthika Deepam2 : కార్తీక్, దీపల పెళ్ళి ఆపడానికి జ్యోత్స్న మరో ప్లాన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -445 లో..... కార్తీక్, దీపల పెళ్లి ఆపాలని శ్రీధర్, పారిజాతం, జ్యోత్స్న ఒకటవుతారు. ఎలా ఆపాలని ప్లాన్ ల మీద ప్లాన్ లు వేస్తుంటారు. శ్రీధర్, పారిజాతం ఇద్దరు ఐడియా చెప్తే జ్యోత్స్న వద్దని చెప్పి తానొక ఐడియా ఇస్తుంది. శౌర్యని కాసేపు కిడ్నాప్ చేస్తే పెళ్లి ఆగిపోతుంది. ఆ తర్వాత వదిలిపెడదామని జ్యోత్స్న అనగానే దానికి ఇద్దరు సరే అంటారు.

ఆ తర్వాత పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగి కార్తీక్, దీప పెళ్లిపీటలపై కూర్చుంటారు. దీప డల్ గా ఉండడంతో ఎందుకు అలా ఉన్నావని కార్తీక్ అడుగుతాడు. నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉండాలి. ఇక్కడ ఉన్నవాళ్లు మన రక్తసంబంధీకులు అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత శౌర్యా ఎక్కడ అని కాంచన అనగానే అనసూయ వెళ్లి చూస్తుంది. ఎక్కడ కన్పించకపోవడంతో అందరు షాక్ అవుతారు. దీప, కార్తీక్ పెళ్లి పీటలపై లేచి శౌర్య కోసం చూస్తారు. అక్కడ ఒకమ్మాయి శౌర్యని చూసిందని.. శౌర్యని ఎవరో కార్ లో తీసుకొని వెళ్లారని చెప్తుంది. దీప, కార్తీక్ బయటకు వెళ్ళబోతుంటే శౌర్య వస్తుంది. ఎక్కడకి వెళ్ళావని అడుగుతారు. ముద్దుల తాత నన్ను షాపింగ్ కి తీసుకొని వెళ్ళాడని శౌర్యా చెప్తుంది. వెనకాలే శివన్నారాయణ వచ్చి అందరికి బట్టలు తీసుకున్నాం.. దానికి తీసుకోలేదని వెళ్ళానని శివన్నారాయణ అనగానే అందరు కూల్ అవుతారు. అప్పుడే ఒకావిడ తన పాపపై కోప్పడుతుంది. ఎక్కడకి వెళ్ళావే అని అడుగుతుంటే.. ఎవరో గదిలో పెట్టి డోర్ వేసారని చెప్తుంది. ఎవరో నిన్ను చూసుకోకుండా వేశారులే అమ్మ అని శివన్నారాయణ అంటాడు.

అదేంటి నేను అద్దాలు మార్చడం వల్ల పిల్లనే మార్చేసానా అని శ్రీధర్ అనుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్ కి దీప, సుమిత్ర, దశరథ్ లు బట్టలు పెడుతారు. వాళ్ళు మార్చుకోవడానికి వెళ్తారు. ఆ లోపు జ్యోత్స్న మరొక ప్లాన్ తో రెడీగా ఉంటుంది. పాలల్లో మత్తు మందు కలుపుతుంది. అది శ్రీధర్ చూస్తాడు. ఇవి తాగి దీప మంచిగా పడుకుంటుంది మావయ్య అని శ్రీధర్ కి చెప్తుంది జ్యోత్స్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.