Read more!

English | Telugu

అబ్బాయిలు ఎవరూ రెడీగా లేకపోయినా అంకుల్స్ ఆలోచించండి

సురేఖావాణి ఇండస్ట్రీలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుతెచ్చుకుంది. అలాంటి ఆమె తన కూతురు సుప్రీతను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఆమె కూడా అడపాదడపా మూవీస్ అవీ చేస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది. అలాంటి సుప్రీత రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది. 

"అబ్బాయిలు ఎవరూ రెడీగా లేకపోయినా కానీ అంకుల్స్ మీరు ఆలోచించండి. మా అమ్మను బాగా చూసుకోవాలి, ఫైనాన్సియల్ పరంగా స్టేబుల్ గా ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ని నెగటివ్ గా చూడకూడదు. ఫస్ట్ టాక్సిక్ గా ఉండకూడదు. మా అమ్మను మంచిగా చూసుకునేవాళ్ళు ఐతే నాకు హ్యాపీ. ఎందుకంటే నేను ఒకప్పుడు మా అమ్మకు తెలీకుండా ఒక టాక్సిక్ రిలేషన్ లో ఉన్నాను. అతను ఎలాంటి వాడు అంటే జీన్స్ వేసుకోకూడదు, ఫ్రాక్స్ వేసుకోకూడదు, స్లీవ్ లెస్ వేసుకోకూడదు. నెయిల్స్ పెట్టించుకోకూడదు..అని కండిషన్స్ పెట్టేవాడు . అప్పట్లో పిచ్చితనం, వెర్రితనం, కుర్రతనం కదా అందుకే ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేసా. ఇక పెళ్లి విషయం అంటే మా అమ్మకు నచ్చాకే పెళ్లి చేసుకుంటా. లవ్ మ్యారేజ్ ఐనా అరేంజ్డ్ మ్యారేజ్ ఐనా కూడా అమ్మ ఓకే అన్నాకే..పెళ్ళికి ఇంకా బోలెడంత టైం ఉంది. డాడీ చనిపోయిన టైంలో అమ్మను ట్రిప్స్ కి తీసుకెళ్ళేదాన్ని. ఐతే చాలామంది కూడా నాన్న చనిపోయిన బాధ లేకుండా ఎలా తిరుగుతున్నారో, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో  అంటూ కామెంట్స్ పెడతారు...మేము సంపాదించేవాటిల్లో అస్సలు సేవింగ్స్ చేసుకోకుండా ట్రిప్స్ కి వెళ్ళిపోతూ ఉంటాం. నాకు సోషల్ మీడియా నుంచి ఒక బల్క్ అమౌంట్ వస్తే బయటకు వెళ్ళిపోతాం. మీకు మా వీడియోస్ నచ్చకపోయినా..మా ట్రిప్స్ కానీ మా ఛానల్ నచ్చకపోయినా చూడకండి" అని చెప్పింది సుప్రీతా.