English | Telugu

ఇండస్ట్రీలో కొందరు నన్ను బెదిరించారు

ఇండస్ట్రీలో కొందరు నన్ను బెదిరించారు

 

జబర్దస్త్ తన్మయ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫుల్ కామెడీ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ ఆమె ఒక ఇంటర్వ్యూ చేసింది. అందులో తన జీవిత కష్టాలన్నీ చెప్పుకొచ్చింది. అసలు తానూ ఎలా ట్రాన్ఫర్మ్ కావాల్సి వచ్చింది...అప్పుడు ఎదుర్కున్న కష్టాలు, మాటల దాడుల గురించి చెప్తూ బాధపడింది. ఐతే ఇంకో ముఖ్య విషయాన్ని కూడా షేర్ చేసుకుంది. లాస్ట్ ఇయర్ ఆగస్టు లో తన్మయ్ ఫాదర్ కన్నుమూశాడు. "ఐతే ఆయన చనిపోయే ముందు రోజు రాత్రి శ్రీదేవి డ్రామా కంపెనీ షూటింగ్ ఐపోయాక  నాన్నతో వీడియో కాల్ లో మాట్లాడాను. ఆ తర్వాత రోజు ఉదయం 11 గంటలకు నాన్న చనిపోయాడు అన్న న్యూస్ వచ్చింది.

ఆ టైములో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీలేదు.ఎం చేయాలో తెలీలేదు. షాక్ లో ఉండి ఇమ్మానుయేల్ కి ఫోన్ చేసాను.అమ్మ షూటింగ్ లో ఉన్నాను లేదంటే వచ్చేవాడిని అని చెప్పాడు. తర్వాత నూకరాజుకు ఫోన్ చేశా. ఎక్కడి పనులు అక్కడ వదిలిపెట్టి, షూటింగ్ ని కూడా వదిలేసి కార్ వేసుకుని వచ్చేసాడు. నేను ఏడుస్తూనే ఉన్నాను. హైదరాబాద్ లో నా చెయ్యి పట్టుకున్నవాడు మా నాన్న దగ్గరకు వెళ్లేంత వరకు నా చెయ్యి వదల్లేదు. నాకు ధైర్యం చెప్తూనే ఉన్నాడు. నాకు తెలిసి నాకు హెల్ప్ చేసిన వ్యక్తి నూకరాజు ఒక్కడే. డబ్బులుపరంగా కూడా ఎవరూ హెల్ప్ చేయలేదు. ఎవరి లైఫ్ వాళ్లకు ఉంటుంది. నేను రెండేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి కారణం కొంతమంది పెద్ద హోదాలో ఉన్నవాళ్లు నన్ను కొట్టి, తిట్టి, నన్ను బెదిరించారు...ఇవన్నీ తెలిస్తే మా అమ్మా వాళ్ళు బాధపడతారని నేను ఎప్పుడూ చెప్పలేదు." అంటూ తన్మయ్ తన జీవితంలో పడిన కష్టాలని చెప్పుకొచ్చింది.