Read more!

English | Telugu

మేమంతా ఒకచోట కలిస్తే రచ్చ రచ్చే!

జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే. వర్ష-ఇమ్మాన్యుయేల్ కాంబినేషన్ లో జబర్దస్త్ స్టేజ్ మీద ఎన్నో స్కిట్లు హిట్ అయ్యాయి. మొదట హైపర్ ఆది టీంలో ఒక కంటెస్టెంట్ గా ఉన్న ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు టీం లీడర్ అయ్యాడు. జబర్దస్త్ లో కొత్త నీరు ప్రవహిస్తున్నట్టుగా ఇంద్రజ, కృష్ణ భగవాన్ జడ్జ్ లుగా చేస్తున్నారు. వీరికి తగ్గట్టుగా జబర్దస్త్ కొత్త కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు మరింత చేరువవుతుంది.

జబర్దస్త్ లో ఇమ్మాన్యుయేల్ తో పాటుగా బాబు, సందీప్, పంచ్ ప్రసాద్, నరేష్, నూకరాజు అందరూ ఇప్పుడిప్పుడే తమ కామెడీ టైమింగ్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇమాన్యుయల్ హావభావాలకి జడ్జ్ గా చేస్తున్న ఇంద్రజ కూడా చాలాసార్లు పాజిటివ్ గా కామెంట్ చేసారు. అంతకముందు వేణు, సుడిగాలి సుధీర్, ధన్ రాజ్, చలాకీ చంటి, చమ్మక్ చంద్రలతో మంచి స్కిట్ లతో సూపర్ హిట్ గా నిలిచిన జబర్దస్త్ క్రమంగా కామెడీ తగ్గిపోయిందని ప్రేక్షకులు భావిస్తున్న తరుణంలో కొత్త కంటెస్టెంట్స్, కొత్త టీం మేట్స్ తో పూర్వ వైభవం తేవాలని చూస్తుంది మల్లెమాల బ్యానర్. అయితే ఈ కొత్త టీంలలో బుల్లెట్ భాస్కర్, ఇమ్మాన్యుయేల్, అజర్, సందీప్, నూకరాజల స్కిట్స్ మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి.

తాజాగా పంచ్ ప్రసాద్ కి ఆరోగ్యం బాగోలేదని తెలియడంతో చాలా మంది జబర్దస్త్ అభిమానులు తనకి ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఇమాన్యుయల్ తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటూ వస్తున్నాడు. అయితే తను ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టాడు. అందులో రెగ్యులర్ గా వీడియోలు, రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు ఇమ్మాన్యుయేల్. అయితే తాజాగా యూట్యూబ్ ఛానెల్ లో ఒక ఫంక్షన్ కోసం కామారెడ్డికి వెళ్తున్నట్టుగా వ్లాగ్ చేసాడు. ఇందులో బాబుతో పాటు అజర్ కూడా ఉన్నారు.

ఇంకా కొంతమంది జబర్దస్త్ వాళ్ళు కూడా ఆ ఫంక్షన్ కి అటెంట్ అయినట్టు చూపించగా.. అందులో నూకరాజు, రైటర్ సందీప్, పంచ్ ప్రసాద్, నరేష్, పటాస్ ఫైమా ఉన్నట్టుగా చూపించాడు. అయితే వీళ్ళంతా ఒక చోట చేరితే రచ్చ రచ్చే అని వారు చేసిన అల్లరిని, కామెడీని అన్నింటిని ఈ వ్లాగ్ లో చూపించాడు ఇమ్మాన్యుయేల్. కాగా యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. జబర్దస్త్ చూసే అభిమానులంతా ఈ వీడియోకి కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.