English | Telugu
Illu illalu pillalu : విశ్వక్ చెంప చెల్లుమనిపించిన వేదవతి.. కొడుకుని పట్టించుకోని రామరాజు!
Updated : Feb 2, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -71 లో... ఒంటి నిండా దెబ్బలతో ఉన్న ధీరజ్ ని చూసి వేదవతి షాక్ అవుతుంది. అసలు ఏమైందంటూ ఏడుస్తుంది. ధీరజ్ సైలెంట్ గా ఉంటాడు కానీ సాగర్ చెప్తాడు. ఎదరింటి విశ్వక్ గాడు తమ్ముడిని చంపబోయాడని చెప్పగానే అందరు షాక్ అవుతారు.
ఇక వేదవతి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆవేశంగా ఎదురింటికి వెళ్లి అందరిని బయటకు పిలుస్తుంది. ఏంటే ఎంత దైర్యమే నీకు నా ఇంటికి వచ్చి ఇలా మాట్లాడుతున్నావంటూ వేదవతిని భద్రవతి అడుగుతుంది. నా కొడుకుని చంపాలనుకుంటారా అని వేదవతి అనగానే.. ఏం మాట్లాడుతున్నావ్ మేమే మా అమ్మాయిని తీసుకొని వెళ్లారని కోప్పడతామని, మీరే ఒక ప్లాన్ తో వచ్చారా అని రేవతి అంటుంది. నీ కొడుకు నా కొడుకుని చంపాలనుకున్నాడని వేదవతి అంటుంది. విశ్వక్ రాగానే తన చెంప చెల్లుమనిపిస్తుంది. వాళ్లకు సమాధానం చెప్పురా లేదంటే ఊళ్ళో మన పరువు తీసేలా ఉన్నారని విశ్వక్ తో భద్రవతి అంటుంది. విశ్వక్ సైలెంట్ గా ఉండడంతో తను తప్పు చేసాడని అందరికి అర్థమవుతుంది.
అప్పుడే రామరాజు వస్తాడు. వేదవతిని లోపలికి రమ్మని అంటాడు. అందరు లోపలికి వెళ్తారు. ధీరజ్ పై ఎటాక్ జరిగిందని వేదవతి చెప్తున్నా.. అసలు కనీసం ధీరజ్ ని కన్నెత్తి కూడా చూడడు రామరాజు. దాంతో వేదవతి, ధీరజ్ లు బాధపడతారు. మరొకవైపు అలా ఎందుకు చేసావంటూ విశ్వక్ ని భద్రవతి కొడుతుంది. మీ చెల్లి విషయంలో మీరు తప్పు చేసారు కానీ నేను అలా చెయ్యలేనని విశ్వ అంటాడు. తరువాయి భాగంలో ధీరజ్, ప్రేమ ఇద్దరు టామ్ అండ్ జెర్రీలాగా కొట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.