English | Telugu
Illu illalu pillalu : శ్రీవల్లి గిల్టీ నగలు కనిపెట్టిన రేవతి.. ప్రేమ, ధీరజ్ ల మధ్య దూరం!
Updated : Jul 19, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -214 లో.. వేదవతితో మాట్లాడడానికి ప్రేమ, నర్మద వస్తారు. మీరు నాతో మాట్లాడకండి.. నన్ను మోసం చేసారు. ప్రేమకి ఇంత దైర్యం రావడానికి కారణం నువ్వే.. నీ వల్లే ఇదంతా అని నర్మదపై కోప్పడుతుంది వేదవతి. అదంతా శ్రీవల్లి వింటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ల దగ్గరికి వస్తుంది శ్రీవల్లి.
ఎందుకు అత్తయ్యని ఇబ్బంది పెడుతున్నారని ప్రేమ, నర్మద వాళ్ళని పంపిస్తుంది శ్రీవల్లి. నేను మీకున్నాను అత్తయ్య అని శ్రీవల్లి యాక్టింగ్ చేస్తుంది. మరొకవైపు ధీరజ్ దగ్గరికి ప్రేమ వచ్చి.. సారీ రా అని చెప్తుంది నువు మీనాన్నపై నీకు ఎంత ప్రేమ ఉందో నీపై కూడా నాకూ అంతే ప్రేమ.. అందుకే ఇలా చేసానని ప్రేమ అంటుంది. దాంతో ధీరజ్ షాక్ అవుతాడు. నువ్వు నాపై ఏం ఆశలు పెట్టుకున్నావో నాకు తెలియదు కానీ ఈ రూమ్ లో వస్తువులు ఎలాగో నువ్వు అలాగే అని ప్రేమతో ధీరజ్ అనగానే తను బాధపడుతుంది. ఐ హేట్ యు అని అద్దం పై రాస్తుంది. మరొకవైపు ప్రేమ నగలు తీసుకొని భద్రవతి ఇంటికి వస్తాడు తిరుపతి . అన్ని నగలు ఉన్నాయో చూడమని రేవతికి చెప్తుంది భద్రవతి. రేవతి నగలు చూస్తుంది.
అందులో కొన్ని నగలు శ్రీవల్లి తన నగలు కలుపుతుంది. ఇవి ప్రేమ నగలు కాదని రేవతికి డౌట్ వస్తుంది కానీ ఆ విషయం చెప్తే మళ్ళీ ఎక్కడ గొడవ జరుగుతుందోనని రేవతి సైలెంట్ గా ఉంటుంది. మరొక వైపు నా గిల్టీ నగలు వాళ్ళు గుర్తుపట్టారేమోనని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. తిరుపతి రాగానే నగలు ఇచ్చావా బాబాయ్ అని శ్రీవల్లి అడుగుతుంది. తరువాయి భాగం లో ప్రేమ ఎంబీఏ అప్లికేషన్ ఫామ్ తీసుకొని వస్తాడు ధీరజ్. అది ప్రేమ చింపేస్తుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.