English | Telugu

Illu illalu pillalu : అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టిన శ్రీవల్లి.. వేదవతికి మాటిస్తారా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'( Illu illalu pillalu).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -175 లో.....చందు ఒంటరిగా కూర్చొని శ్రీవల్లి మాటలు గుర్తుచేసుకుంటాడు. అప్పుడే సాగర్ వచ్చి.. ఏం ఆలోచిస్తున్నావు అన్నయ్య అంటాడు. నీకు ఇది వరకే చెప్పాను.. నీ భార్య నా భార్య విషయంలో కలుగజేసుకోకని చెప్పమని.. అయిన తన మాటలతో నా భార్యని బాధపెడుతుంది. ఇప్పుడు తన చెల్లి వస్తే కూడా అలాగే బాధపెట్టారట అని సాగర్ తో చందు అంటాడు. అప్పుడే దీరజ్ వస్తాడు.

మొన్న ట్యూషన్ విషయంలో కూడా వదిన జోక్యం చేసుకుంది. ఏమైనా అంటే ఇంటికి పెద్ద కోడలు అంటుంది. అందరి గురించి పట్టించుకుంటున్నపుడు తన గురించి కూడా ఇంట్లో వాళ్ళు జోక్యం చేసుకుంటారు కదా అని ధీరజ్ అనగానే.. నేను అన్నది నాకే చెప్తున్నావా.. ఇన్ని రోజులు ఆ మాటలు మనసులో పెట్టుకున్నావా.. బాగా అర్ధమవుతుందిరా.. ప్రేమ, నర్మద ఒకటి అందుకే మీరిద్దరూ ఒకటి అయ్యారా అని చందు అంటాడు. అప్పుడే వేదవతి వచ్చి ఒరేయ్ ఇలా తయారయ్యారేంటి.. ఎంత బాగా కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడు ఇలా అయ్యారు.. మీరు గొడవ పెట్టుకోనని మాటివ్వండి అని వేదవతి అంటుంది. అందరు సైలెంట్ గా వెళ్ళిపోతారు.ఆ తర్వాత వేదవతి దగ్గరికి రామరాజు వచ్చి‌. ఇంట్లో సిచువేషన్ ఎలా ఉందని అడుగుతాడు. అసలు బాలేదు.. ఇప్పుడు వాళ్ళ మధ్య దూరం పెరుగుతున్నట్లనిపిస్తుందని వేదవతి అంటుంది. ఇంత మంది ఉన్న దగ్గర అవి జరుగుతూనే ఉంటాయని రామరాజు అంటాడు.

మరొకవైపు ధీరజ్ ను ఉహించుకుంటూ ప్రేమ ఊహల్లో తెలిపోతుంది. ప్రొద్దున నిద్రలేచి.. అసలు నా మనసు ఎందుకిలా ఉంది.. నిజంగానే ధీరజ్ ని లవ్ చేస్తున్నానా అని పేపర్ పై ఇద్దరి పేర్లు రాసి ఫ్లేమ్స్ వేస్తుంది. అందులో లవ్ అని రావడంతో ప్రేమ సిగ్గుపడుతుంది. ధీరజ్ నిద్ర లేచి ఇంత ప్రొద్దున నిద్రలేచి ఏం చేస్తున్నావ్.. ఆ పేపర్ లో ఏముందని అడుగుతాడు ఏం లేదు. ఇవి నా బుక్స్ అని ప్రేమ అంటుంది. ఏదో తేడాగా బెహేవ్ చేస్తున్నావని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.