English | Telugu

Illu illalu pillalu:  అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టిన శ్రీవల్లి.. నువ్వు చేసింది ముమ్మాటికి తప్పేరా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu Pillalu)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-166లో... చందు దగ్గరకు వెళ్లిన శ్రీవల్లి.. ఏడుస్తూ తన యాక్టింగ్ మొదలెడుతుంది. ఏమైంది వల్లీ ఎందుకు ఏడుస్తున్నావని చందు అడిగేసరికి.. విషయం చెప్పకుండా భోరున ఏడుస్తుంటుంది. ఏమైందో చెప్పు వల్లీ అని చందు అడిగేసరికి.. వయసులో పెద్దదాన్ననే గౌరవం లేదు.. వదినతో ఎలా మాట్లాడాలో కూడా తెలియకపోతే ఎలా అని శ్రీవల్లి యాక్టింగ్ చేస్తుంది. ఏమైందో చెప్పు వల్లీ.. నిన్ను ఎవరేమన్నారని అడుగుతాడు చందు. ఎవరో అన్నారులెండి.. అది మీకు చెప్తే.. నేను వచ్చి మీ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన దాన్ని అవుతాను.. అందుకే ఆ అవమానం ఏదో నేనే పడతాను.. నా ఏడుపేదో నేను పడతాను. నన్ను ఇలా వదిలేయండి అని శ్రీవల్లి అంటుంది.

మీ తమ్ముడు ధీరజ్ చాలా దారుణంగా మాట్లాడాడండి అని శ్రీవల్లి చెప్తుంటే చందు అసలు నమ్మడు. అసలు నువ్వెవరు.. మా ఇంటికి వచ్చి పది పదిహేను రోజులు కూడా కాలేదు. మా ఇంటి విషయాలు నీకెందుకు అంటూ మాట్లాడాడండి అంటూ శ్రీవల్లీ అతడిపై చాడీలు చెప్తూనే ఉంటుంది. శ్రీవల్లి చెప్పేదంతా చందు వింటు షాక్ అవుతాడు. చిన్నోడు అలా మాట్లాడు.. అయిన ప్రేమ ట్యూషన్ గురించి నువ్వెందుకు చెప్పావని చందు అంటాడు. అయ్యో.. నేను ఈ ఇంటి పెద్దకోడల్ని కదా.. నాకు ఆమాత్రం బాధ్యత ఉండదా.. మీరు ఇప్పుడు మీ తమ్ముడ్ని అడుగుతారా లేదా.. వదినతో మాట్లాడే పద్దతి మార్చుకోమని తనకు చెప్తారా లేదా.. లేదంటే నా విలువే పోతుంది. అసలు నా ఏడుపుకి కూడా మీ దగ్గర విలువ లేదా అంటూ చందుతో సరే అనిపించేదాకా శ్రీవల్లి ఏడుస్తుంది.

మరునాడు పొద్దున్నే ధీరజ్ పలకరించినా చందు మాట్లాడడు.. ఏమైందని ధీరజ్ అడిగితే.. నువ్వు మీ వదినతో మాట్లాడిన పద్దతి కరెక్ట్ కాదురా అని చందు కోపంగా అంటాడు. నేను మాట్లాడింది కరెక్టేరా అన్నయ్యా.. ప్రేమ విషయంలో జ్యోక్యం చేసుకోవడం వల్లే కదా సమస్య వచ్చింది. పనికట్టుకుని మిల్‌కి వెళ్లి వదిన అలా చెప్పడం అవసరమా అని ధీరజ్ పైకి లేచి కోపంగా అంటాడు. దాంతో చందుకి మరింత కోపం వస్తుంది. అదంతా తిరుపతి వింటూ చూస్తూ షాక్ అవుతాడు. వెంటనే చందు కూడా పైకిలేచి.. చెప్పే పద్దతి అది కాదు.. అయినా మీ వదిన పరాయిది కాదుగా అంటూ వాదనకు దిగుతాడు. ఇదంతా చూసి, విన్న తిరుపతి వెంటనే వాళ్ల మధ్యలోకి వచ్చి.. ఏంట్రా మీ పెళ్లాల కోసం మీరు గొడవ పడటం కరెక్ట్ కాదురా అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు. అయితే చందు వెళ్తూ వెళ్తూ కూడా.. రేయ్ ధీరజ్.. మీ వదినతో అలా మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదురా అనేసి వెళ్లిపోతాడు. ధీరజ్ బాధగా తిరుపతి వైపు..తిరుపతి బాధగా ధీరజ్ వైపు చూస్తుండిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.