English | Telugu

Illu illalu pillalu:  భాగ్యంపై భద్రవతికి డౌట్.. కొత్త కోడలు చక్రం తిప్పనుందా!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-142లో.. ధీరజ్, ప్రేమలు తమ గదిని ఖాళీ చేస్తుంటారు. నా నిర్ణయం తప్పు అంటావా.. నిన్ను అడగకుండానే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు మీ ఇంట్లో లగ్జరీగా పెరిగావ్.. కానీ ఇప్పుడు మనం ఈ గది ఇచ్చేస్తే నువ్వు నేలపైనే పడుకోవాలి.. నేలపై పడుకోవడం నీకు అలవాటు లేదని నాకు తెలుసు. నీ ఇబ్బంది గురించి ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకున్నా.. కానీ తప్పలేదు. నా నిర్ణయం తప్పైతే సారీ ప్రేమా అని ధీరజ్ అంటాడు. నీ ప్లేస్‌లో నేను ఉన్నా ఇలాగే చేసేదాన్ని. నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావ్.. గొప్పగా ఆలోచించావ్.. అలవాటు లేకపోయినా పర్లేదు. కష్టమైనా పర్లేదు.. నేలపైనే పడుకుంటా. నన్ను అడగకుండా నిర్ణయం తీసుకున్నందుకు నువ్వు నాకు సారీ చెప్పాల్సిన పని లేదని ప్రేమ అంటుంది. ఆ మాటతో ధీరజ్.. థాంక్యూ ప్రేమా.. నన్ను బాగా అర్థం చేసుకున్నావని చేయి అందిస్తాడు. అనంతరం ఇద్దరూ చేతులు కలిపేసుకుని ఒకర్నొకరు చూసుకుంటారు. ఇంతలో సాగర్, నర్మదలు వచ్చి లగేజ్ సర్దుకోవడం అయిపోయిందా అని అడుగుతారు. హా అయిపోయింది అయిపోయింది అంటూ లగేజ్ తీసుకుని ప్రేమ, ధీరజ్ బయటకు వచ్చేస్తారు. బయట చందు, శ్రీవల్లిలు ఉండటంతో.. వెల్ కమ్ అంటూ ఇద్దరు స్వాగతం పలుకుతారు.

వాళ్లు బయటకు రావడం.. వీళ్లు లోపలికి వెళ్లడం మామూలుగా ఉండదు. పెద్దోడు చందు లోపలికి వెళ్తూ.. తమ్ముడు భుజంపై చేయి వేసే సీన్ చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ధీరజ్ అన్నయ్య చేతిని పట్టుకుని భావోద్వేగానికి గురౌతాడు. అన్నదమ్ముల ప్రేమానురాగాల గురించి చెప్పుకోవాలంటే.. అప్పట్లో రామాయణం.. ఇప్పుడు మిమ్మల్ని కళ్లారా చూస్తున్నానని భాగ్యం అంటుంది. ఇక శ్రీవల్లి గదిలోకి వస్తుంది. గది భలే ఉంది బా.. కానీ మన కోసం మీ తమ్ముడు మరదలు గది ఖాళీచేయడమే బాధగా ఉందని శ్రీవల్లి అనగానే.. వల్లీ.. మీ అమ్మ వచ్చారు కదా.. నువ్వు ఏమీ అనుకోకుండా.. ఓసారి డబ్బుల గురించి గుర్తు చేస్తావా అని చందు అడుగుతాడు. ఏ డబ్బులు బా.. అని శ్రీవల్లి అడిగేసరికి.. అదే పెళ్లి ఖర్చుల కోసం నేను పది లక్షలు ఇచ్చాను కదా.. అవి నేను వడ్డీకి తీసుకొచ్చాను. పదిరోజుల్లో తిరిగి ఇచ్చేస్తామని ఆరోజు నువ్వు చెప్పావ్ కదా.. ఒక్కసారి వెళ్లి మీ అమ్మని అడుగమని చందు అంటాడు. సరే బా.. వెళ్లి మా అమ్మని అడుగుతానని చెప్పి భాగ్యం దగ్గరకు వెళ్తుంది శ్రీవల్లి. అమ్మోయ్ కొంపలు మునుగుతున్నాయే.. మీ అల్లుడు గారు ఆ పది లక్షలు ఎప్పుడిస్తావో అడగమన్నారని భాగ్యంతో శ్రీవల్లి అంటుంది. ఆ మాటతో అదేంటే అమ్మడూ.. అప్పుడే అడగడం ఏంటని భాగ్యం అనగానే పది రోజుల టైమ్ అయిపోయింది కదా అమ్మా అని శ్రీవల్లి అంటుంది. వీళ్ళిద్దరిని సేనాపతి, భద్రవతి గమనిస్తుంటారు‌.

ఇక శ్రీవల్లి అయితే.. అమ్మోయ్ బావకి నాపై చాలా నమ్మకం ఉందే.. మనం డబ్బుల కోసం మోసం చేశామని తెలిస్తే ఆయన నా ముఖం కూడా చూడడేమోనని భయంగా ఉందే. మన బండారం బయటపడితే.. కాపురం ఏమౌతుందోనని చచ్చేంత భయంగా ఉందని శ్రీవల్లి బాధపడుతుంటుంది. ఒసేయ్.. మెల్లగా పైనుంచి ఆ భద్రవతి వాళ్లు మనల్ని చూస్తున్నారు.. వాళ్లు వింటే కొంపలు అంటుకుంటాయ్. అసలే వాళ్లు ఈ ఇంటి పాలిట సీసీకెమెరాల్లా ఉన్నారు.. అల్లుడు గార్ని ఇంకో పది రోజులు గడువు అడుగమని భాగ్యం చెప్తుంది. పది రోజుల తరువాత అయిన పది లక్షలు ఇవ్వాలి కదమ్మా అని శ్రీవల్లి అనగానే.. ఏం చేయాలో నేను చూసుకుంటాను కదా.. నువ్వు వెళ్లి ముందు ఈ ముక్కని అల్లుడు గారికి చెప్పమని భాగ్యం అంటుంది. ఏం చెప్పడమో ఏంటో.. ఈ పది లక్షలు నా కాపురాన్ని కూల్చేట్టు ఉన్నాయని శ్రీవల్లి బాధపడుతుంది. అమ్మడూ నేను ఉన్నాను కదా.. చక్రం ఎట్టా తిప్పాలో నాకు తెలుసుకదా.. నువ్వు ఈ విషయాన్ని వదిలేసి.. ఇంటిని గుప్పెట్లో ఎలా పెట్టుకోవాలో ఆలోచించమని భాగ్యం చెప్తుంది. నాకెందుకో వీళ్లపై డౌట్‌గా ఉందిరా.. వాళ్లపై ఓ కన్నేసి ఉంచమని సేనాపతికి భద్రవతి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.