English | Telugu

కామెడీ షో నుంచి ఆది వెళ్ళాడు...సద్దాం వచ్చాడు!

జబర్దస్త్ అనే కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే ఈ షోలో కొన్ని ఎపిసోడ్స్ నుంచి హైపర్ ఆది కనిపించడం లేదు. గతంలో జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చాడు. కానీ కొద్ది రోజులుగా అసలు ఆది స్కిట్స్ లో కనిపించడం లేదు.

ఐతే ఇప్పుడు హైపర్ ఆది ప్లేస్ లోకి సద్దాం వచ్చాడు. ఇప్పటికే సద్దాం ఎంట్రీ ఇచ్చిన టు ఎపిసోడ్స్ కూడా సక్సెస్ అందుకున్నాయి. ప్రస్తుతానికి జబర్దస్త్ లో సద్దాం టీమ్ చేస్తున్న కామెడీ నవ్వు తెప్పిస్తోందనే చెప్పొచ్చు. ఐతే ఆడియన్స్ మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు ఎందుకు అంటే హైపర్ ఆది కంటే కూడా సద్దాం మంచి కామెడీ చేస్తున్నాడని అంటున్నారు. గతంలో హైపర్ ఆది లేని టైములో షోకి పెద్దగా రేటింగ్ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు షోని జనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సద్దాం టీమ్ జబర్దస్త్ లో కనిపించేసరికి మల్లెమాలలో కొత్త కళ కనిపిస్తోంది.

జబర్దస్త్ లో హైపర్ ఆది లేకపొతే ముందుకు నడవదు..ఆడియన్స్ గోల చేస్తారు అనుకున్నటైములో సద్దాం ఎంట్రీతో జబర్దస్త్ కి మళ్ళీ ప్రాణం లేచొచ్చినట్టయ్యింది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి రేటింగ్ వస్తే గనక హైపర్ ఆది పూర్తిగా ఈటీవీకి బైబై చెప్పేసినా సద్దాం ఆ బాధ్యతలను చూసుకోగలుగుతాడు అనే నమ్మకం మల్లెమాల యాజమాన్యంలో కనిపిస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.