English | Telugu
ఇండియన్ ఐడల్ సీజన్ 2 కర్టెన్ రైజర్..హోస్ట్ గా హేమచంద్ర, లేడీ జడ్జిగా గీతామాధురి
Updated : Feb 15, 2023
ఇండియన్ ఐడల్ సీజన్ 1 ఆహా ఓటిటి వేదిక మీద దుమ్మురేపింది. ఇక ఇప్పుడు తెలుగు సంగీత ప్రేక్షకులను అలరించడానికి సీజన్ 2 రాబోతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ గా కర్టెన్ రైజర్ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఈవో అజిత్ ఠాకూర్ వచ్చారు. ఇక ఈ షో సెట్ కూడా చూపించారు. ఇక అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ "రీసెంట్ గానే అన్ స్టాపబుల్ సీజన్ 2 పూర్తయ్యింది. నిజం చెప్పాలంటే ఎక్కడికి వెళ్లినా జై బాలయ్య అనే నినాదాలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ గారు థాంక్యూ సో మచ్.
త్వరలో ఆహా యాప్ ని మలయాళం, కన్నడలో కూడా లాంఛ్ చేయబోతున్నాం." అని చెప్పారు. ఇక సీజన్ 2 హోస్ట్ గా హేమచంద్ర ఎంట్రీ ఇచ్చారు. "తెలుగు ఆడియన్స్ తో అతనికున్న దోస్తీ, పాటలతో అందరిని ఫిదా చేసే స్వరం అతని ఆస్తి" అంటూ ఆహా ఒక కాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. జడ్జెస్ విషయానికి "ఎవరి పేరు చెప్తే స్పీకర్లు వూఫర్లు గడగడా వణుకుతాయో, ఆయనే మన మొదటి జడ్జ్" అంటూ తమన్ కి వెల్కమ్ చెప్పింది ఆహా. తర్వాత "ఎన్నో పాటలకి ప్రాణం పోసి మన హార్ట్స్ లో ఎప్పటికీ నిలిచిపోయే మెలోడీస్ ని మాస్ నంబర్స్ ని మనకి అందించిన కార్తీక్, మన సెకండ్ జడ్జ్" అని కాప్షన్ పెట్టి అతని ఫోటోని రిలీజ్ చేసింది. వీళ్ళతో పాటు గత సీజన్ లో లేడీ జడ్జిగా నిత్యా మీనన్ కనిపించింది.
ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి గీతా మాధురి ఎంట్రీ ఇచ్చింది. "కమర్షియల్ సినిమా అయినా, లవ్ స్టోరీ అయినా, మాస్ బీట్ అయినా మెలోడీ అయినా, తన పాటలకి కనెక్ట్ అవ్వని వారుండరు" అని ఆహా ఆమెకు సంబంధించిన ఒక కాప్షన్ పెట్టి ట్విట్టర్ లో రిలీజ్ చేసింది. ఇక ఈ సీజన్ లో ఇద్దరు చేంజ్ అయ్యారు. ఈ సరికొత్త ప్యానల్ తో సరికొత్త ఫార్మాట్ తో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది.