English | Telugu

Guppedantha Manasu : దేవయాని కన్నింగ్ మాటలు.. అల్లాడిన అనుపమ, మను!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1051 లో... మనుని అందరి ముందు అవమానించినందుకు శైలేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. పిచ్చివాడిలాగా నేను గెలిచానంటూ గట్టిగా అరుస్తుంటే.. స్టూడెంట్స్ అందరు శైలేంద్రని అదోరకంగా చూస్తుంటారు. మరొకవైపు మను తండ్రి మీరని చెప్పి తప్పు చేశారు మావయ్య అని వసుధార అంటుంది. తప్పలేదు అమ్మ అలా వాళ్ళు ఎన్నిసార్లు అవమానపడతారు. మను కళ్ళలో బాధని చూడలేకపోయాను. అందుకే అలా చెప్పాల్సి వచ్చిందని మహేంద్ర అంటాడు.

మీరు ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసానని అనుకుంటున్నారు కానీ అసలు ప్రాబ్లమ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మను, అనుపమ గార్ల రియాక్షన్ ఎలా ఉందోనని వసుధార అంటుంది. మరొకవైపు మహేంద్ర అన్న మాటలు గుర్తుకుచేసుకుంటుంది అనుపమ. అప్పుడే దేవయాని వచ్చి.. అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది అనుపమ.. తెలుగు సీరియల్ లో ట్విస్ట్ లాగా రోజు ఒక ట్విస్ట్ జరుగుతుందని దేవయాని అంటుంది. మొన్నటివరకు అసలు మనుకి నీకు ఏం సంబంధం ఉందో తెలియలేదు. ఆ తర్వాత మీరు తల్లి కొడుకులని తెలిసింది. ఇప్పుడు మనుకి తండ్రి మహేంద్ర అంట.. అయితే నీ మెడలో తాళి ఏది? అంటే మహేంద్రది నీది ఇల్లీగల్ రిలేషనా అని దేవయాని సూటిపోటి మాటలంటుండగా.. అంతలోనే వసుధార వస్తుంది. ఏం మాట్లాడుతున్నారంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇంత గోరంగా దిగజారీ మాట్లాడతున్నారని వసుధార అనగానే.. అలా చేస్తుంది నేను కాదు మీ మావయ్య, ఈ అనుపమ అని దేవయాని అంటుంది.

మరొకవైపు మహేంద్ర దగ్గరికి మను వస్తాడు. నాపై కోపంగా ఉందా అని మహేంద్ర అంటాడు. అంటే మీరు అలా అవమానపడుతుంటే చూడలేకపోయాను అందుకే అని మహేంద్ర అంటాడు. మీరు అలా చెప్పి డామేజ్ చేశారంటూ మను కోపంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనం ఇదంతా ప్లాన్ చేస్తే బాబాయ్ మొత్తం చెడగొట్టాడు. ఈ దెబ్బతో మను కాలేజీ నుండి వాళ్ళిపోతాడని అనుకున్నానని శైలంద్ర అనగానే.. అయితే ఏంటి మన ప్రయత్నం మనం వదలొద్దని దేవయాని అంటుంది. ఆ తర్వాత అనుపమ దగ్గరికి మహేంద్ర వస్తాడు. అనుపమ సైలెంట్ గా ఉంటుంది. నాతో మాట్లాడవా అని మహేంద్ర అడుగుతాడు. నువ్వు అలా అందరి ముందు మనుకి తండ్రి అని చెప్పడం కరెక్ట్ కాదని మహేంద్రతో అనుపమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.