Read more!

English | Telugu

నువ్విచ్చిన సెమినార్ మొదటిదేనా అని రిషిపై డౌట్ తో అడిగిన విశ్వనాథం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్‌- 815 లో.. కాలేజీ చైర్మెన్ విశ్వనాథం, ప్రిన్సిపల్, జగతి, మహేంద్రలు కలిసి సెమినార్ తర్వాత మాట్లాడుకుంటారు. మా కాలేజీలో సెమినార్ కి అటెంట్ అయ్యారు వెరీ థాంక్ ఫుల్ అని విశ్వనాథం అనగా.. అలాంటి ట్యాలెంటెడ్ లెక్చరర్స్ ని సత్కరించే అవకాశం దక్కడం మా అదృష్టమని జగతి అంటుంది. ఈ సెమినార్ వల్లే నా కొడుకిని ఇన్ని సంవత్సరాల తర్వాత చూడగలిగానని తన మనసులో అనుకొని సంతోషపడుతుంది జగతి. ఇదంతా శైలేంద్ర కిటికీలో నుండి చూస్తాడు. కొడుకు కనపడకున్నా నిబ్బరంగా నిలబడింది. మన బెదిరింపులకు భయపడలేదు. అన్ని సమస్యలను దాటుకొని తన భర్తకు దగ్గరైంది. ఇన్ని సమస్యలను వేటాడుతూ వచ్చిన పిన్ని నిజంగా ఆడపులి అని శైలేంద్ర తన మనసులో అనుకుంటాడు.

మీ స్టాఫ్ ఇచ్చిన రిషి సర్ ఇచ్చిన సెమినార్ బాగుంది. స్టూడెంట్స్ అందరికి అర్థమయ్యేలా బాగా సెమినార్ ఇచ్చాడని జగతి అంటుంది. అతని స్పీచ్ విన్న తర్వాత మాకు ఒక ఆలోచన వచ్చిందని మహేంద్ర అనగా.. అడగండి మీరు స్టూడెంట్స్ కోసం, సమాజం కోసం ఎంతగా ఆలోచిస్తారో మాకు తెలుసని విశ్వనాథం అంటాడు. 'మిషన్ ఎడ్యుకేషన్' కి మంచి రిసోర్సెస్ కోసం ఎదురుచూస్తున్నాం. రిషీ వసుధారలు మిషన్ ఎడ్యుకేషన్ కోసం పనిచేస్తే బాగుంటుంది. దానికోసం ఈ కాలేజీలోనే ఉండి పనిచేయోచ్చు. మా కాలేజీకి రానక్కర్లేదని జగతి అంటుంది. ఈ విషయం వాళ్ళిద్దరిని అడిగి, బోర్డ్ మెంబర్స్ ని అడిగి చెప్తామని విశ్వనాథం అంటాడు.

ఆ తర్వాత మహేంద్ర, రిషి దగ్గరికి వచ్చి.. నేను మీ నాన్నని అని అంటాడు. మీరు ఇక్కడికి సెమినార్ ఇవ్వడానికి మాత్రమే వచ్చారు. ఒకరికొకరికి ముఖపరిచయం మాత్రమే ఉందని రిషి చెప్తాడు. మనిద్దరి మద్య ముఖపరిచయం మాత్రమే ఉందా.. నా కళ్ళలోకి చూసి చెప్పగలవా అని రిషితో మహేంద్ర అంటాడు. మనసువిప్పి మాట్లాడమని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత  రిషిని మహేంద్ర హత్తుకొని ఏడుస్తాడు. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్నాను. ప్లీజ్ నన్ను ఇలా ఒంటరిగానే వదిలేయండని రిషి అంటాడు. ఆ తర్వాత రిషి, వసుధార, ఏంజిల్, విశ్వనాథం కలిసి ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక రిషి వల్లే మన కాలేజీకి గుర్తింపు వచ్చిందని విశ్వనాథం అంటాడు. వీళ్ళిద్దరు కలిసి చేస్తే  అట్టడుగున ఉన్న దాన్ని కూడా పైకి తీసుకొస్తారని ఏంజిల్ అంటుంది. "DBST కాలేజీ బోర్డ్ మెంబర్స్ మన కాలేజీకి రావడమేంటి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ కాలేజీ ఎండీ తీసుకునే నిర్ణయాలు అన్నీ నీ ఆలోచన ధోరణికి దగ్గరగా ఉన్నాయని అనిపిస్తుంది. నువ్వు ఒక్క సెమినార్ కండక్ట్ చేస్తేనే ఇంత ఆదరణ పొందిందంటే ఇది నీ మొదటి సెమినారేనా? లేక ఇంతకముందు వేరే కాలేజీలో చేసావా" అని రిషిని విశ్వనాథం అడుగుతాడు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.