Read more!

English | Telugu

అహ్మదాబాద్ హోటల్ లో గుప్పెడంత మనసు నటి!

జ్యోతి రాయ్.. ఈ పేరు విని ఉండకపోవచ్చు గానీ జగతి మేడం అంటే తెలియని వారు ఉండరు. స్టార్ మాటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే "గుప్పెడంత మనసు" ప్రేక్షకులకు జగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో అందరిని మెప్పిస్తూ, ఒక తల్లిగా కొడుకుపై చూపించే ప్రేమని వ్యక్తపరచడంలో జగతి పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది.

జ్యోతి రాయ్ కన్నడ నటి.. కన్నడలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి, తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జీ తెలుగులో ప్రసారమైన 'కన్యాదానం' సీరియల్ లో నిరుపమ్ పరిటాలతో కలిసి మొదటిసారి జ్యోతిరాయ్ నటించింది. ఆ తర్వాత  'గుప్పెడంత మనసు' సీరియల్ లో ప్రస్తుతం నటిస్తుంది. గత కొంతకాలం నుండి గుప్పెడంత మనసు సీరియల్ టాప్ రేటింగ్ లో ఉంటు వస్తుంది. జ్యోతిరాయ్ అలియాస్ జగతి.. అలనాటి నటుడు సాయి కిరణ్ కి భార్యగా గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. తన అందంతో పాటు హావభావాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది జగతి. జ్యోతి రాయ్ ఒకవైపు ఈ సీరియల్ మరొక పక్క ఒక వెబ్ సిరీస్ తో బిజీగా ఉంటుంది.

తాజాగా జ్యోతిరాయ్ తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోస్ ని షేర్ చేసింది. ప్రతీరోజు "గుప్పెడంత మనసు" సీరియల్ లో చీరకట్టులో ఒక అమ్మ పాత్రలో జగతిని చూసిన ప్రేక్షకులకి తన పర్సనల్ లైఫ్ లో ఉండే ఫోటోలు కాస్త భిన్నంగా అనిపిస్తాయి. అయితే అదంతా తన పర్సనల్ అని ఇంతకముందు ఒక పోస్ట్ లో  జగతి అలియాస్ జ్యోతిరాయ్ కామెంట్ రూపంలో చెప్పింది. అయితే తాజాగా అహ్మదాబాద్ లోని ఒక హోటల్ రూంలో దిగిన ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది జ్యోతిరాయ్. బ్లాక్ టీషర్ట్ అండ్ బ్లూ జీన్స్ తో ఉన్న ఈ ఫోటోకి..  ' అడ్వకేటింగ్ గ్లామర్' అనే క్యాప్షన్ పెట్టింది జ్యోతీరాయ్. ఆ హోటల్ లో దిగిన కొన్ని ఫోటోలని చూస్తుంటే, తనేదో సినిమానో వెబ్ సిరీస్ షూటింగ్ కోసం వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఈ ఫోటోలని చూసిన కొందరు పాజిటివ్ గా తీసుకుంటే మరికొందరు మాత్రం.. "మీరు ఇలానే బాగున్నారు కదా మరెందుకని అమ్మ పాత్రలో చేస్తున్నారు" అంటూ కామెంట్ చేస్తున్నారు. పర్సనల్ లైఫ్ వేరు ఆన్ స్క్రీన్ వేరు అంటుంది జ్యోతిరాయ్. కాగా గుప్పెడంత మనసు సీరియల్ లో రిషికి తల్లిగా జగతి పాత్రలో జ్యోతీరాయ్ ఆకట్టుకుంటుంది.