Read more!

English | Telugu

మీకు హౌస్ లో 'ఫ్రెండ్ ఫర్ లైఫ్' ఎవరు: నాగార్జున

ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున వచ్చి రాగానే 'ఫ్రెండ్ ఫర్ లైఫ్' టాస్క్ కంటెస్టెంట్స్ తో ఆడించాడు. "ఇందులో హౌస్ నుండి బయటకు వెళ్ళాక లైఫ్ లాంగ్ ఫ్రెండ్ గా ఎవరు ఉండాలనునుకుంటున్నారు" అని చెప్పమని, మొదట అదితో మొదలెట్టాడు. "ఫైమా ఫ్రెండ్ ఫర్ లైఫ్ సర్. ఇనయా కొంచెం తక్కువ క్లోజ్. బయటకు వెళ్ళాక కూడా కొంచెం తక్కువగా ఉంటుంది" అని ఆదిరెడ్డి అన్నాడు. ఆ తర్వాత ఇనయా చెప్పింది. "లైఫ్ లాంగ్ ఫ్రెండ్ కీర్తి అని, శ్రీహాన్  కొంచెం తక్కువ" అని చెప్పింది. 

ఆ తర్వాత రేవంత్ ని అడుగగా "ఫ్రెండ్ ఫర్ లైఫ్ శ్రీసత్య. ఇంకా కీర్తితో కాస్త తక్కువగా మాట్లాడాను. కాబట్టి తనతో బయటకు వెళ్ళాక తక్కువగా ఉంటుంది అని అనుకుంటున్నాను సర్" అని రేవంత్ చెప్పాడు. ఆ తర్వాత రోహిత్ మాట్లాడుతూ "ఆదిరెడ్డి లైఫ్ లాంగ్ ఫ్రెండ్. కానీ దూరం ఉంటాడు కదా" అని అనగా, "వీడికోసం రావాల్సి వచ్చేటట్టు ఉంది"  అని ఆదిరెడ్డి చెప్పాడు. ఆ తర్వాత "ఫైమా బయటకు వెళ్ళాక దొరకదు" అని రోహిత్ అన్నాడు.

ఫ్రెండ్ ఫర్ లైఫ్ ఆదిరెడ్డికి ఇచ్చింది ఫైమా. ఆ తర్వాత ఫైమా మాట్లాడుతూ "రోహిత్ ఫ్రెండ్ షిప్  కట్ చేసుకుంటున్నా" అని అంది. నెక్స్ట్ కీర్తిభట్ వచ్చి "శ్రీహాన్ తో కాస్త తక్కువగా మాట్లాడతాను కాబట్టి అని తన ఫోటోని చింపేస్తున్నా.. ఇంకా ఇనయా చాలా దగ్గర అవుతుంది" అని కీర్తి చెప్పింది. రేవంత్ ని అడుగగా "ఇద్దరు ఉన్నారు సర్ .. శ్రీసత్య కొన్నిసార్లు అర్థం చేసుకోదు. శ్రీహాన్ అలా కాదు అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు అసలైన చిక్కా.. కీర్తిభట్  నన్ను తక్కువ అర్థం చేసుకుంది " అని  రేవంత్ చెప్పాడు. ఆ తర్వాత శ్రీసత్య వచ్చింది. "మొదట ఫ్రెండ్ ఫర్ లైఫ్ రేవంత్.. ఎందుకంటే హౌస్ లో ఫస్ట్ నుండి మేము ఫ్రెండ్స్ గా ఉన్నాం.. ఆ తర్వాత రోహిత్ తో కాస్త తక్కువగా మాట్లాడుతాను. ఇద్దరం తక్కువే మాట్లాడుకున్నాం. ఇప్పుడే ఇంత తక్కువ మాట్లాడుకున్నామంటే బయటకెళ్ళాక రోహిత్ తో కష్టం సర్" అని శ్రీసత్య చెప్పింది. అలా ఒక్కొక్కరుగా వచ్చి హౌస్ బయటకు వెళ్ళాక ఎవరిని ఎక్కువగా కలుద్దామనుకుంటున్నారో చెప్పారు.