English | Telugu

హౌస్ లో‌ 'బీబీ జోడీ'ల సందడి!

నిన్న జరిగిన బిగ్ బాస్-6 ఎపిసోడ్ సరికొత్త ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ అన్ని సీజన్లలో ఉన్న కంటెస్టెంట్స్ మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి జోడిలుగా రాబోతున్నారు. అందులో‌ నిన్న కొందరు వచ్చారు. దీంతో హౌస్ లో‌ వినోదం డబుల్ అయ్యింది.

హౌస్ లోకి మొదటగా రోల్ రైడా వచ్చాడు. వచ్చి రాగానే మచ్చా అంటూ రేవంత్ కి హాగ్ ఇచ్చాడు. ఆ తర్వాత అందరితో మాట్లాడాడు. రోల్ రైడా, రేవంత్ కలిసి డ్యాన్స్ చేసారు. హౌస్ మేట్స్ కి చిన్న ఛాలెంజ్ పెట్టి.. అందులో గెలిచిన వారికి సర్ ప్రైజ్ ఉంటుందని చెప్పాడు. అందులో కీర్తి గెలిచింది. దీంతో రోల్ రైడా ఒక బర్గర్ ఇచ్చాడు కీర్తీకి. కాసేపు హౌస్ మేట్స్ తో మాట్లాడి బయటకొచ్చేసాడు. ఆ తర్వాత హౌస్ లోకి మెహబూబ్, అషు రెడ్డి జంటగా వచ్చారు. ఇక హౌస్ మేట్స్ తో కలిసి కాసేపు డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత కబుర్లు చెప్పుకున్నారు. ఇక టైం అయిపోయిందని బయటకు పంపించేసాడు బిగ్ బాస్.

ఆ తర్వాత 'కన్నెపిట్టరో.. కన్ను కొట్టరో' పాటకి డ్యాన్స్ చేస్తూ ముక్కు అవినాష్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అవినాష్ తర్వాత అరియాన వచ్చింది. వీళ్ళిద్దరు వేరే లెవల్ పర్ఫామెన్స్ ఇచ్చారు. మస్త్ ఆట, పాటలతో వినోదాన్ని పంచారు. ఆ తర్వాత యాంకర్ కృష్ణచైతన్య, RJ కాజల్ వచ్చారు. మొదట డ్యాన్స్ చేసి, తర్వాత కంటెస్టెంట్స్ తో సరదగా గడిపారు. ఆ తర్వాత సీరియల్ యాక్టర్ రవికిరణ్, యాంకర్ భాను వచ్చారు. ఆ తర్వాత 'బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు‌' దీన్ని మూడు సార్లు ఆపకుండా, తడబడకుండా రిపీట్ చేయమని చెప్పాడు రవికిరణ్. రోహిత్ రెండు సార్లు బాగానే రిపీట్ చేసాడు.. కానీ మూడవ సారి మిస్టేక్ చెప్పాడు. ఆ తర్వాత శ్రీహాన్ కూడా ఇలాగే మరొకటి రిపీట్ చేసాడు. కీర్తి యూ ఆర్ స్ట్రాంగ్ అని భాను చెప్పింది. 'ఆరు ఎర్ర లారీలు, నాలుగు నల్ల లారీలు' రిపీట్ చేసింది కీర్తి. అలా రిపీట్ చేస్తూ అన్నీ తప్పులుగా చెప్తుంటే భాను హెల్ప్ చేసింది. దీంతో కీర్తి కంటే భానునే ఎక్కువ చేసింది. "ఇది నీకు ఇచ్చిన టాస్క్ లా లేదు. మాకు ఇచ్చిన పనిష్మెంట్ లా ఉంది" అని అంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.