English | Telugu

Eto Vellipoyindhi Manasu : అత్త ప్లాన్ ఫెయిల్.. కోడలి పూజ సక్సెస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -127 లో.. పూజకి టైమ్ అవుతుంది. వచ్చిన వారితో పూజలో కూర్చొమని పంతులు గారు చెప్తారు. ఎవరు రాలేదని రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. ఎవరు రాకపోవడం ఏంటని అప్పుడే వచ్చిన సుజాత అడుగుతుంది. పిలిచావ్ కదా రాకపోవడం ఏంటని శ్రీలత అంటుంది. వాళ్లతో కలిసి పూజ చేస్తేనే వ్రతం ఫలితం ఉంటుందని పంతులు అంటారు. సరే అయితే ఇంకెప్పుడు అయిన చేసుకుందువని రామలక్ష్మితో శ్రీలత అంటుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. ఏమైందని అడుగుతాడు. మీరు ఇప్పుడు పూజ చెయ్యలేదని బాధపడకండి అని సీతాకాంత్ తో శ్రీలత అంటుంది. పంతులు గారు మీరు వెళ్ళండని శ్రీలత చెప్తుంది.

ఆ తర్వాత రామలక్ష్మి అంటూ అయిదుగురు వస్తారు. దాంతో రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శ్రీలత శ్రీవల్లి డిస్సపాయింట్ అవుతారు. ఆ తర్వాత సీతాకాంత్ తన మేనేజర్ కి చెప్పి వాళ్ళని పిలిపించిన విషయం గుర్తుకుచేసుకుంటాడు.మిమ్మల్ని పిలువలేదు కదా.. మీరు ఎలా వచ్చారని రామలక్ష్మి వాళ్ళని అడుగుతుంది. మేం ఇదే కాలనీలో ఉంటున్నాం.. సీతాకాంత్ భార్య పూజ చేసుకుంటుందని తెలిసి వచ్చామని వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత రామలక్ష్మి పూజ చేసుకొని వాయినం ఇచ్చి పంపిస్తుంది.

ఆ తర్వాత శ్రీవల్లి వాళ్ళు ఎలా వచ్చారని ఆలోచిస్తుంటే.. అందులో ఆలోచించండానికి ఏముంది సీతాకాంత్ రప్పించాడని తన మాటల్లోనే అర్థమవుతుందని శ్రీలత అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి వచ్చి నా చుట్టూ దుష్టశక్తలు ఉన్నాయని స్వామి చెప్పింది నిజమే.. ఈ పూజ ఆపాలని చాలా ట్రై చేశారు కానీ వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిందంటూ ఇండైరెక్ట్ గా శ్రీలత శ్రీవల్లిలకి వార్నింగ్ ఇస్తుంది రామలక్ష్మి.ఆ తర్వాత రామలక్ష్మి సీతాకాంత్ గదిలో ఉండగా వచ్చి.. చాలా థాంక్స్ దేవుడా వాళ్ళని టైమ్ కి పంపించారని రామలక్ష్మి అంటుంటే.. అయ్యో అన్నిసార్లు ఎందుకు పర్లేదని సీతాకాంత్ అంటాడు. మీరు ఎందుకు అలా అంటున్నారు.‌ మీరే పంపించారా అని రామలక్ష్మి అడుగుతుంది‌. అదేం లేదని చెప్తాడు. మరుసటి రోజు ఉదయం శ్రీలత, సందీప్ లు ఏదో మాట్లాడుకుంటుంటే.. ఏం మాట్లాడుకుంటున్నారని రామలక్ష్మి వచ్చి వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.