English | Telugu

Eto Vellipoindhi Manasu:ప్రాణాపాయ స్థితిలో సిరి ప్రేమించినవాడు.. ఇదంతా శ్రీలత ప్లానే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు ' . ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-28లో.. సిరికి చెప్పి వాడిని పిలిపించు అని శ్రీలత అనగానే.. అమ్మ ఏం మాట్లాతున్నావ్ నువ్వు? అంటే నువ్వు వాళ్ళ ప్రేమని ఒప్పుకుంటు‌న్నావా అని శ్రీలత కొడుకు సందీప్ అడుగుతాడు. పిలిపించేది పెళ్ళి విషయం మాట్లాడటానికి కాదురా.. వాడు మన ఇంటికి బయల్దేరతాడు కానీ మధ్యలోనే అని శ్రీలత అనగానే.. అంటే ఆనందంతో గాలిలో తేలుకుంటు వచ్చే వాడి ప్రాణాలు గాలిలోనే కలిసిపోతాయన్నమాట అని సందీప్ అంటాడు. పదా సిరితో మాట్లాడాలి.. కాదు కాదు నమ్మించాలని సందీప్ తో శ్రీలత అంటుంది.

మరోవైపు సిరి తన గదిలో ఒంటరిగా కూర్చొని భాదపడుతుంది. మా ప్రేమని ఆశీర్వదిస్తావని అనుకున్నావని అనుకున్నా అన్నయ్య.‌‌ కానీ అమ్మ కొట్టిందనే భాదకంటే నువ్వు ద్వేషిస్తున్నావనే భాదే ఎక్కువగా ఉందని సిరి అనుకుంటుంది. అప్పడే అక్కడికి సిరి వాళ్ళ అమ్మ శ్రీలత, అన్నయ్య సందీప్ వస్తాడు. ఇక సిరి వాళ్ళ అమ్మ శ్రీలత తన నటన మొదలెడుతుంది‌. నువ్వు ప్రేమించినవాడిని పిలిపించు అతనెవరు ? అతని కుటుంబమేంటని తెలుసుకుందామని సిరితో వాళ్ళ అమ్మ శ్రీలత అంటుంది. అది విని సిరి షాక్ అవుతుంది. నువ్వేనా అమ్మ ఇలా మాట్లాడతుందని సిరి షాక్ అవుతుంది. అమ్మ ప్రేమ నీకు తెలియదని శ్రీలత చెప్తుంది. పొగొట్టుకున్నాక భాదపడటం కంటే పోకముందే జాగ్రత్త పడటం ఉత్తమమని సిరితో వాళ్ళ అమ్మ శ్రీలత అంటుంది. ఇంకేం ఆలోచించకుండా అతడికి ఫోన్ చేయమని శ్రీలత అంటుంది. ఇక ధనకి సిరి ఫోన్ చేసి.. మా అమ్మ మన ప్రేమకి ఒప్పుకుంది‌. నువ్వు వెంటనే ఇక్కడి రా .. నీ గురించి అన్నీ అడిగి తెలుసకుంటారంట అని అనగానే.. సరే వస్తానని ధన అంటాడు. ఇక అదే విషయం శ్రీలతతో చెప్పగా.. నువ్వు హ్యాపీగా కదా, ఇక రెస్ట్ తీసుకో అతను రాగానే నీకు చెప్తానని సిరీతో శ్రీలత చెప్పి బయటకు వచ్చేస్తుంది. ‌మరోవైపు రామలక్ష్మి జరిగింది తల్చుకొని భాదపడుతుంది‌.

ధన అతని ఫ్రెండ్ కలిసి వస్తున్నప్పుడు కొందరు‌ రౌడీలు చుట్టుముడతారు. మా సిరి అమ్మ జోలికి వచ్చావంటే ప్రాణాలతో ఉండవని చెప్పి చితక్కొడతారు. ఇక అదే సమయంలో‌ ధన ఇంకా ఇంటికి రాలేదని రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. కాసేపటికి ధన ఫ్రెండ్ రామలక్ష్మికి ఫోన్ చేసి.. ధన నేను వస్తుంటే యాక్సిడెంట్ అయిందని చెప్తాడు. దాంతో రామలక్ష్మి షాక్ అయి.. టెన్షన్ పడుతూ పెద్ద గాయాలేం కాలేదు కదా అని అడుగుతుంది. లేదని అతను చెప్పడంతో కంగారుగా హాస్పిటల్ కి వస్తుంది. ఐసీయూలో ధనకి ట్రీట్ మెంట్ జరుగుతుండగా రామలక్ష్మి చూసి‌.. అసలేం జరిగింది అవి యాక్సిడెంట్ వల్ల కాలేదని గాయాలు కన్పిస్తున్నాయని ధన ఫ్రెండ్ ని రామలక్ష్మి నిలదీస్తుంది. సిరి వాళ్ళ అమ్మ ఎటాక్ చేపించిందని బాగా కొట్టారని అతను చెప్పగానే రామలక్ష్మి షాక్ అవుతుంది. నేనేదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగిందని రామలక్ష్మి భాదపడుతుంది. మరోవైపు సీతాకాంత్ జరిగిందంతా తల్చుకొని ఆలోచిస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.