English | Telugu

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి కొత్త ప్లాన్.. సింపథీ డ్రామా వర్కవుట్ అయ్యేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -278 లో.....సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వస్తుంది. తప్పులు చేసేది ఒక సందీప్ అనుకున్నా కానీ ఆ లిస్ట్ లోకి ధన కుడా చేరాడని సీతాకాంత్ ఆవేశంగా మాట్లాడతాడు. ఇది ఒక అంతుకి మంచి అయ్యింది ఇప్పుడు నిజం బయటపడింది లేదంటే తప్పు మీద తప్పు చేస్తునే ఉండేవారని సీతాకాంత్ కి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంటుంది రామలక్ష్మి.

ఆ తర్వాత జరిగింది గుర్తు చేసుకొని సిరి బాధపడుతుంటే.. అప్పుడే ధన వచ్చి నేను కావాలని అప్పు చెయ్యలేదు ఇంకొకసారి ఇలా ఎప్పటికి చెయ్యను కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా అని రిక్వెస్ట్ చెయ్యగానే.. సిరి క్షమిస్తుంది. ఆ తర్వాత సందీప్, ధన, శ్రీవల్లి, శ్రీలతలు జరిగిన దాని గురించి డిస్కషన్ చేస్తుంటారు. అసలు ఆ శంకర్ గాడు అలా ఎలా వచ్చాడని సందీప్ అనగానే.. నేనే రప్పించానని శ్రీలత అంటుంది. అందరు షాక్ అవుతారు. అదేంటీ మీరు సేవ్ చేస్తారన్నారు.. ఇప్పుడు మీరే ఇలా చేశారని ధన అనగానే ఇప్పుడు తెలిస్తేనే సీతా అప్పు తీరుస్తాడు లేదంటే ప్రాబ్లమ్ అవుతుందని శ్రీలత చెప్తుంది.

సందీప్, ధన లకి సీతాకాంత్ ని నమ్మకంతో గెలవాలని, మీరు మారినట్టు తెలియాలని శ్రీలత చెప్తుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం శ్రీలత చెప్పినట్లు సందీప్, ధనలు దేవుడు ముందు చేతిలో హారతి వెలిగిస్తారు. అది చూసి సీతాకాంత్, రామలక్ష్మి వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారంటూ అడుగుతారు. అందరి ముందు ఇద్దరు సింపథీ ట్రై చేస్తారు. కాసేపటికి సందీప్, ధనలకి మళ్ళీ ఏదో ప్లాన్ చెప్తుంది శ్రీలత. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.