English | Telugu

Illu illalu pillalu : భాగ్యం, ఆనందరావు డ్రామా.. అమూల్య పెళ్ళిచూపులు జరుగుతాయా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -361 లో..... తిరుపతి ఫోన్ లో తన అతిలోక సుందరితో మాట్లాడుతుంటే సాగర్, ధీరజ్,చందు వచ్చి వింటారు. నువ్వు ఒకసారి తనని కలుస్తానని అడుగు మావ అని ధీరజ్ అనగానే ఈ రోజు నిన్ను కలుస్తానని అంటాడు. తను ఈ రోజు సాయంత్రం కలవమని అడ్రెస్ చెప్తుంది. అ తర్వాత ధీరజ్ ఫోన్ చూస్తుంటే తనని డిస్టబ్ చెయ్యాలని ప్రేమ చాలా ట్రై చేస్తుంది.

అ తర్వాత మావయ్య ధీరజ్ నాపై కోప్పడుతున్నాడు. పెళ్లివాళ్లకు కావలసిన స్వీట్ తీసుకొని వద్దామంటే వద్దని ధీరజ్ అంటున్నాడని కావాలనే రామరాజుకి చెప్తుంది ప్రేమ. ఒరేయ్ అమ్మాయిని తీసుకొని వెళ్ళు.. ఎందుకు వినడం లేదు అమ్మాయితో వెళ్లి స్వీట్ తీసుకొని రా అని రామరాజు అనగానే ఇక తప్పక ధీరజ్ వెళ్తాడు. మధ్యలో పెట్రోల్ అయిపోతే ప్రేమని దిగమని కోప్పడతాడు. దాంతో ప్రేమతో చెప్పమని అంటుంది ప్రేమ. ఇక ధీరజ్ కోపంగా తను బైక్ మీద ఉండగానే తోసుకొని వెళ్తాడు. పెట్రోల్ కొట్టిస్తాడు. ధీరజ్ కి తెలియకుండా తన జేబులో పర్సు తీస్తుంది ప్రేమ. తీరా పెట్రోల్ కి డబ్బులు ఇద్దమంటే పర్సు ప్రేమ చేతిలో ఉంటుంది. ఇక ధీరజ్ కి కోపం వచ్చి బైక్ అక్కడే వదిలేసి వెళ్తుంటే ప్రేమ అతనికి డబ్బు ఇచ్చి బైక్ వేసుకొని ధీరజ్ వెనకాల వెళ్తుంది. మావయ్య ధీరజ్ నాతో గోడవపడ్డాడని ఫోన్ లో చెప్పినట్లు ప్రేమ యాక్టింగ్ చెయ్యగానే ధీరజ్ వస్తాడు. ఏం చెయ్యలేక ప్రేమ బైక్ డ్రైవ్ చేస్తుంటే వెనకాల కూర్చుంటాడు ధీరజ్.

మరొకవైపు అముల్యని చూడడానికి వచ్చేవాళ్ళకి ఎదురుగా మారువేషంలో భాగ్యం, ఆనందరావు వెళ్తారు. మీరు చూడాలని అనుకుంటున్న అమ్మాయి వేరొకరితో లవ్ లో ఉందని చెప్తారు. అ తర్వాత రామరాజు ఇంట్లో పెళ్లిచూపులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తారు. వాళ్ళు రారుగా అని శ్రీవల్లి అనుకుంటుంది. అంతలోనే పెళ్లిచూపులకి వచ్చే వాళ్ళు కార్ లో ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.