English | Telugu

మీరు మా అక్కను పెళ్లి చేసుకున్నారనుకోండి..నేను ఫ్రీ..


ఢీ జోడి ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఈ షో గ్రాండ్ ఫినాలేకి వచ్చేసింది. ఈ టైటిల్ ఇవ్వడానికి యంగ్ అండ్ డైనమిక్ హీరో అడివి శేష్ వచ్చాడు. కార్ లో దిగి గన్ ని హ్యాండిల్ చేస్తూ ఇచ్చిన పోజ్ చాలా యూనిక్ గా ఉంది. తర్వాత స్టేజి మీద టైటిల్ ని తీసుకొచ్చాడు. ఇక అడివి శేష్ ని చూసేసరికి అశ్విని చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. "మా సిస్టర్ కి మీరంటే చాలా ఇష్టం అండి" అని అశ్విని చెప్పేసరికి "నాక్కూడా మీ మొత్తం ఫామిలీ అంటే ఇష్టమండి" అని చెప్పాడు అడివి శేష్. "అయ్యయ్యో ఒక వేళా మీరు మా అక్కను పెళ్లి చేసుకున్నారనుకోండి మీకు 1 + 1 ఆఫర్ వస్తది. అంటే అక్కను పెళ్లి చేసుకుంటే నేను కూడా వస్తాను. ఎలా వస్తానో కూడా చెప్తాను" అంది అశ్విని. "ఎలాగో చెప్పండి ప్లీజ్ " అన్నాడు అడివి శేష్. "సినిమాల్లో కంటే పెద్ద ట్విస్టుల్లా ఉన్నాయి నీవి" అన్నాడు ఆది పక్కనుంచి. "నేను ఆది కామెడీకి బిగ్ ఫ్యాన్ కానీ డాన్స్ ఐతే అంత కాదు" అన్నాడు. జడ్జ్ విజయ్ బిన్నీ మాష్టర్ గురించి చెప్తూ "విజయ్ మాష్టర్ కానీ నాకు బ్రదర్ ఫస్ట్.. ఒక చిన్న చరిత్ర కూడా ఉంది కదా బ్రో. మరి అప్పట్లో " అంటూ ఒక సస్పెన్సు ని క్రియేట్ చేసాడు అడివి శేష్. ఇక సోనియా సింగ్, సిద్ధుని ఆది పరిచయం చేసాడు.

"మీర్జాపురం యువరాణి ఆవిడ వాడు మీర్జాపురంలో మున్నాభాయ్..నేను అంతఃపురం ఆది.. ఇది అవతార్ అశ్విని " అన్నాడు. హోస్ట్ నందు విన్నర్ ఎవరో చెప్తూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేసరికి "నీకంటే నాకే ఎక్కువ టెన్షన్ గా ఉంది బ్రో" అంటూ చెప్పాడు అడివి శేష్. "ఇది కాస్త టఫ్ గానే ఉంది మావా" అంటూ ఆదికి చెప్పేసరికి "ఆ టెన్షన్ తట్టుకోలేకే హన్సిక పక్కకొచ్చి నిలబడ్డా" అంటూ ఆది కామెడీ చేసాడు. మరి ఇంతకు ఎవరు విన్ అవుతారో ఈ వీక్ ఎపిసోడ్ లో తెలిసిపోతుంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.