English | Telugu
మీ తాతగారి కొడుకు కొడుకు నాన్న కొడుకు నాన్న కొడుకు నీకేమవుతాడు...
Updated : Dec 10, 2022
కామెడీ స్టాక్ ఎక్స్చేంజిలో సెకండ్ రౌండ్ "పద చూసుకుందాం" అనే కాన్సెప్ట్ లో సబ్జెక్టు అనేది ప్రతీ వారం మారుతూ ఉంటుంది. ఇక ఈ వారం చుట్టరికాలు చెప్పి ఎవరికీ ఎవరు ఏమవుతారో అడిగారు. "మీ నాన్నగారి భార్య చెల్లెలి కొడుకు మీ అన్నయ్యకు ఏమవుతాడు" అని హోస్ట్ అడిగేసరికి హరి బజర్ నొక్కి "సోదరుడు" అవుతాడని రైట్ ఆన్సర్ చెప్పాడు. " మీ అమ్మగారి వాళ్ళ నాన్నగారి వాళ్ళ కూతురు కూతురు భర్త మీకేమవుతాడు" అని అడిగేసరికి సద్దాం "బాబాయ్" అని రాంగ్ ఆన్సర్ చెప్పాడు. కరెక్ట్ ఆన్సర్ "బావ" అని హరి చెప్పాడు. "మీ తాతగారి వాళ్ళ కొడుకు కొడుకు నాన్న కొడుకు నాన్న కొడుకు నీకేమవుతాడు" అని అడిగేసరికి " యాదమ్మ రాజు బజర్ ప్రెస్ చేసి "తమ్ముడు" అని కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు.
ఇక ఈ రౌండ్ లో ఆఖరి ప్రశ్నని దీపికా పిల్లి అడిగింది "అవినాష్ వాళ్ళ అన్న కొడుకు వాళ్ళ అమ్మ చెల్లెలు అవినాష్ కి ఏమవుతుంది" అనేసరికి వేణు ఆన్సర్ చెప్పాలని చైర్మన్ అన్నారు. "కొడుకు" అని రాంగ్ ఆన్సర్ చెప్పేసరికి "మరదలు" రైట్ ఆన్సర్ అని చెప్పింది దీపికా. ఇక సెకండ్ రౌండ్ అయ్యాక కామెడీ ఇండెక్స్ ప్రకారం యాదమ్మ రాజు విన్నర్ గా నిలిచాడు. ఇక సెకండ్ రౌండ్ పూర్తయ్యేసరికి లోయెస్ట్ స్టాక్ గా అవినాష్ నిలిచాడు.