English | Telugu

బాలీవుడ్ లో నటించే ఛాన్స్ వస్తే...రామ్-నితిన్ కాంబోలో ఐతే ...


జబర్దస్త్ లో చైల్డ్ ఆర్టిస్టులు ఎప్పుడూ స్పెషల్ గానే ఉంటారు అందులో యోధ అనే చైల్డ్ ఆర్టిస్ట్ ఇంకా పాపులర్. ఒకప్పటి జడ్జి రోజాకి ఆమె అంటే చాల ఇష్టం కూడా. అలాంటి యోధ..సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఛాన్సెస్ వస్తే అటు సీరియల్స్ లో ఇటు మూవీస్ లో నటిస్తూ ఉంటుంది. అలాంటి యోద్ధ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో "సంథింగ్" అని అడిగింది..ఇక నెటిజన్స్ కూడా వాళ్లకు నచ్చిన ప్రశ్నలన్నీ అడిగేసారు. అందులో ఒక ఇంటరెస్టింగ్ ప్రశ్న వచ్చింది.."బాలీవుడ్ లో నటించే ఛాన్స్ వస్తే చేస్తావా" అని అడిగేసరికి "కచ్చితంగా చేస్తాను" అని చెప్పింది.

"నీకు నవ్వు తెప్పించే అంశాలు ఏమిటి" "నా ఫ్రెండ్స్ ని ఇరిటేట్ చేస్తూ ఇమిటేట్ చేస్తూ ఉంటా" , "మీరు చేసిన మూవీస్ లో మీ ఫేవరేట్ మూవీస్ ఏమిటి" "గోవిందుడు అందరి వాడేలే, విరూపాక్ష", "ఏటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఫస్ట్ ప్రోమోలో చాల క్యూట్ క్యూట్ గా ఉన్నావ్ యోధ "థ్యాంక్యూ", రామ్, నితిన్ తో కాంబో" " ఆ..ఆ మాట వినడానికే చాల సంతోషంగా ఉంది.. యోధ జబర్దస్త్ కి రావాలన్నా ఎక్కడైనా షూటింగ్ కి వెళ్ళాలి అన్నా వాళ్ళ నాన్న చందుతో కలిసి వెళ్తుంది. వాళ్ళ నాన్న కూడా సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్. కొంతకాలం క్రితం వరకు యోధ బాగా జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఈ పాప సినిమాల్లో కూడా నటించింది. యోధ కూడా స్టార్ కమెడియన్ లకు సైతం పోటీనిస్తోంది యోద్ధ, అతి చిన్న వయసులోనే చైల్డ్ బెస్ట్ కమెడియన్ గా పేరు సంపాదించుకుంది. ఇక యోధ ఇప్పుడు తన స్టడీస్ మీద ఏకాగ్రత చేస్తోంది. ఐతే అప్పుడప్పుడు ఛాన్సెస్ వస్తుంటే వదులుకోకుండా కూడా వాటిల్లో కూడా నటిస్తూ స్టడీస్ ని, నటనని మేనేజ్ చేస్తోంది.


Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.