English | Telugu
బ్రహ్మముడి సెట్లో లేట్ నైట్ గేమ్స్!
Updated : Jun 13, 2023
కిరణ్ కాంత్.. ఈ పేరు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ కళ్యాణ్ అంటే స్టార్ మా టీవీ సీరియల్ 'బ్రహ్మముడి' చూసే అభిమానులకి తెలిసి ఉంటుంది. బ్రహ్మముడి సీరియల్ లో కవిగా ఉంటు తన కవితలు, సాహిత్యంతో సీరియల్ లోని వాళ్ళనే కాకుండా చూసేవారికి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. అయితే 'బ్రహ్మముడి' సీరియల్ తో క్రేజ్ సంపాదించుకున్న కిరణ్ కాంత్ యూట్యూబ్ ఛానెల్ ని కూడా క్రియేట్ చేసాడు.
బ్రహ్మముడి సీరియల్ లో కళ్యాణ్ పాత్రకి ఒక ప్రత్యేకత ఉంది. దుగ్గిరాల కుటుంబంలో చిన్నవాడిగా అందరి మన్ననలు పొందిన కళ్యాణ్. ఎప్పుడు కవితలతో కాలం గడుపుతుంటాడు. ఎప్పుడు రాజ్ కి సలహాలు ఇస్తూ, ఏ పరిస్థితులలో ఎలా ఉండాలో బాగా తెలిసినవాడిగా నటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా ఈ సీరియల్ లో అప్పు-కళ్యాణ్ ల జోడీ బాగుందంటూ మరికొందరు అభిమానులు ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్ పేజ్ లని కూడా క్రియేట్ చేస్తున్నారు. అయితే వీరిద్దరు కలిసి స్క్రీన్ స్పేస్ ఎక్కువగానే తీసుకుంటున్నారు. ఈ సీరియల్ లోని మిగిలినవారు ఇతడిని అందరిలో ఒకడిగా కాకుండా 'అందరివాడు' లా ట్రీట్ చేస్తున్నారు. అయితే 'బ్రహ్మముడి' షూటింగ్ టైంలో జరిగే కొన్ని అమూల్యమైన సీన్స్, కామెడీ క్లిప్స్ అన్నింటిని కలిపి తన ఇన్ స్ట్రాగ్రామ్ ఛానెల్ లో షేర్ చేస్తుంటాడు కళ్యాణ్ (కిరణ్ కాంత్).
తాజాగా బ్రహ్మముడి సీరియల్ నైడ్ షూటింగ్ జరిగింది. ఇందులో నటిస్తున్న వాళ్ళు బ్రేక్ టైంలో లూడో వంటి కొన్ని గేమ్స్ ఆడుతూ సరదగా గడిపారు. అలాగే అప్పు-కళ్యాణ్ లు కలిసి చేసిన కబడ్డీ ఎపిసోడ్ ని కూడా ఈ వీడియోలో ఆడ్ చేసాడు కళ్యాణ్(కిరణ్ కాంత్). అయితే ఈ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి, లింక్ ని తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. కాగా బ్రహ్మముడి సీరియల్ డైరెక్టర్ కుమార్ పంతం కూడా ఈ వీడియో లింక్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి కొన్ని ఫన్ మూమెంట్స్ అంటూ చెప్పాడు. కాగా ఈ సీరియల్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.