English | Telugu

Brahmamudi : మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్.. తనకి తానే శిక్ష వేసుకున్న భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -460 లో... సుభాష్, అపర్ణల పెళ్లి రోజు సందర్బంగా ఇంట్లోని వారంతా సరదాగా గేమ్స్ ఆడుతారు. అందులో మొదటి గేమ్ లో అపర్ణ, సుభాష్ లు గెలుస్తారు. రెండవ గేమ్ లో ఇద్దరికి కళ్లకు గంతలు కడుతారు. ఇద్దరు పెళ్లి అప్పటి జ్ఞాపకాలు రాస్తారు. అందులో ఇద్దరు చెప్పింది మ్యచ్ అయిందో లేదో చూస్తారు. అందులో సుభాష్ అపర్ణలది మ్యాచ్ అవుతుంది. ఆ తర్వాత ధాన్యలక్ష్మి, ప్రకాష్ లది కూడ మ్యాచ్ అవుతుంది.

రాజ్ , కావ్యలలో ఒకటి మ్యాచ్ అవుతుంది. మీరు మొదటి సారి ఎప్పుడు కలుసుకున్నారని ప్రకాష్ అడుగగా.. దానికి రాజ్ తప్పుగా రాస్తాడు. రాజ్ నిక్ నేమ్ అని కావ్య ని ప్రకాష్ అడుగగా.. మిస్టర్ డిఫెక్ట్ అని ఇద్దరు సేమ్ రాస్తారు. దాంతో అందరూ నువ్వుకుంటారు. ఆ తర్వాత అందరు అలా ఫన్ గా గేమ్స్ ఆడుతుంటే.. కళ్యాణ్ డల్ గా ఉంటాడు. తనని చూసిన రాజ్.. కళ్యాణ్ ని డైవర్ట్ చెయ్యాలని అనుకోని నెక్స్ట్ రౌండ్ డాన్స్.. అని తనకి నచ్చిన పాటకి డాన్స్ చెయ్యాలని రాజ్, కావ్యలు చెప్తారు. మొదటగా ధాన్యలక్ష్మి, ప్రకాష్ లు చేస్తారు. ఆ తర్వాత స్వప్న, రాహుల్ లు.. ఆ తర్వాత కళ్యాణ్ సోలో పాటకి డాన్స్ చేస్తుంటాడు. ఆ పాటకి డాన్స్ చేస్తు కళ్యాణ్ ఎమోషనల్ అవుతూ ఏడుస్తుంటే.. అందరు ఏమైందని దగ్గరికి వస్తారు. ఏం లేదు సాంగ్ ఇలానే ఉంటుందని కళ్యాణ్ అంటాడు. కాసేపటికి రుద్రాణి మాస్ డాన్స్ చేస్తుంది.

కావ్య, రాజ్ లు డాన్స్ చేస్తారు. రాజ్ మొదటి సరిగా కావ్యతో ఇష్టంగా డాన్స్ చేస్తాడు.‌ వాళ్ళు అలా డాన్స్ చేస్తుంటే రుద్రాణి, రాహుల్ తప్ప అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాసేపటి తర్వాత పెద్దమ్మ పెద్దనాన్న కేక్ కటింగ్ అని కళ్యాణ్ అంటాడు. తరువాయి భాగంలో జరిగింది మర్చిపోయేంత చిన్నది కాదు.. అది నా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసింది. మనకి పుట్టిన వాళ్ళు తప్పు చేస్తే క్షమించని ఆడవాళ్లు.. భర్త మోసం చేస్తే జీవితాంతం క్షమించలేరని అపర్ణ అనగానే.. మీకు మీరే శిక్ష వేసుకుంటున్నారు. ఈ బాధ బ్రతికినంతకాలం ఉంటుంది.. ప్రశాంతంగా ఉండలేరని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.