English | Telugu

ఒక అమ్మాయితో భర్త.. సీసీ ఫుటేజ్ లో...

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -401 లో....డ్రింక్ చేస్తున్న రుద్రాణి, రాహుల్ ల దగ్గరికి స్వప్న వచ్చి.. కాసేపు మాట్లాడి డాన్స్ చేద్దామా అని అనగానే వాళ్ళు కూడా చేస్తామని అంటారు. వాళ్ళని డాన్స్ చేసేలా చేసి వాళ్ళు చూడకుండా వాళ్ళు తాగుతున్న డ్రింక్ లో స్వప్న ఏదో కలుపుతుంది. ఆ తర్వాత ఆ డ్రింక్ వాళ్లకి ఇచ్చి తాగమని చెప్తుంది ఇద్దరు ఫుల్ గా డ్రింక్ చెయ్యగానే వాళ్ళ చేత నిజం చెప్పిస్తుంది.

ఆ తర్వాత డబ్బులేం చేశారని స్వప్న అడుగగా.. నా గదిలోనే ఉంచాను.. ఇదిగో కీ కూడా నా దగ్గరే ఉందని చూపించగానే రుద్రాణిని డైవర్ట్ చేసి కీ తీసుకొని స్వప్న డబ్బులు తీసుకుంటుంది. మరుసటి రోజు ఉదయం సేట్ దుగ్గిరాల ఇంటికి వచ్చి స్వప్నకి సారీ చెప్పి ఇంటి పత్రాలు ఇస్తాడు. అసలు అవి మీ దగ్గరికి ఎలా వచ్చాయంటూ స్వప్న అడుగుతుంది. ఎవరో తీసుకొని వచ్చారు లే అమ్మ అంటూ సేట్ అనగానే.. చెప్పండి అని అడుగుతారు. ఎక్కడ వాళ్ళ పేరు చెప్తాడోనని రాహుల్ సేట్ ని తీసుకొని బయటకు వెళ్తాడు. ఏంటి ఇలా చేసావని సేట్ ని రాహుల్ అడుగుతాడు. రాత్రి అమ్మోరు వచ్చారు. నేను నీకు ఇచ్చిన కోటి రూపాయలు.. నావి నాకు ఇవ్వండి లేదంటే మీరే పత్రాలు ఇచ్చారని ఇంట్లో వాళ్ళకి చెప్తానని రాహుల్ కి సేట్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.

మరొకవైపు అప్పు చెప్పిన లొకేషన్ కి కావ్య వెళ్తుంది. ఆ తర్వాత అప్పు కూడా వస్తుంది. తనతో ఇద్దరు కానిస్టేబుల్ ని తీసుకొని వస్తుంటే వాళ్ళని ఎందుకు తీసుకొని వచ్చావంటు కావ్య అడుగుతుంది. వాళ్ళు నిజమైన పోలీసులు కాదు. గెటప్ వేసి తీసుకొని వచ్చాను. వాడు భయపడి నిజం చెప్తాడని అప్పు అంటుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే అక్కడ రాజ్ దగ్గర డబ్బులు తీసుకున్న అతను ఉంటాడు. అతన్ని నిజం చెప్పమని కావ్య బెదిరిస్తుంది. చెప్తానంటూ అతను భయపడుతుంటాడు. తరువాయి భాగంలో రాజ్ ని బ్లాక్ మెయిల్ చేసినతను.. రాజ్ తన దగ్గరికి వచ్చినట్టు, ఒక అమ్మాయితో మాట్లాడడం నేను విన్నానని చెప్తాడు. ఆ తర్వాత కావ్య ఆఫీస్ కి వెళ్లి సీసీ టీవీఫుటేజ్ చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.