English | Telugu

బిగ్ బాస్ సీజన్-7 కి రంగం సిద్ధం.. రిలీజైన కొత్త లోగో!

బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి ఈ సీజన్ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రానుంది. టెలివిషన్ చరిత్రలో వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. గత కొన్ని సంవత్సరాలగా టెలివిజన్ లో ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తూ విజయవంతంగా దూసుకుపోతుంది. టీఆర్పీలో అత్యధిక రేటింగ్ తో ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్డాగా మారింది బిగ్ బాస్.

ఈ సీజన్ కి సంబంధించిన సెట్ పనులు, ఇంకా ప్రోమో షూట్ అంతా ఇప్పటికే మొదలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ టీం కంటెస్టెంట్ ని అప్రోచ్ అవడం కూడా జరిగిందంట, అందులో కొంతమందిని కన్ఫర్మ్ చెయ్యడం, వాళ్ళతో అగ్రిమెంట్ కూడా పూర్తయినట్లుగా తెలుస్తుంది. ప్రతి కేటగిరి నుండి ఒకరిని సెలెక్ట్ చేస్తూ జరిగే ఈ ప్రక్రియలో.. ఒక రియల్ కపుల్ ని తీసుకుంటున్నారంటూ తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్-7 కి హోస్ట్ గా ఈ సారి కూడా నాగార్జున వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. గత సీజన్ కి అవుటింగ్ ఇంటర్వ్యూ చేసిన యాంకర్ శివ ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్-7కి బిబి కేఫ్ యాంకర్ గా అరియన గ్లోరీ వ్యవహరిస్తుందని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్-7 కి సంబంధించిన ప్రోమో షూటింగ్ ఈ నెల ఆఖరున మొదలవుతున్నట్లు సమాచారం.

బిగ్ బాస్ సీజన్-7కి సంబంధించిన చాలా అనుమానాలు ప్రేక్షకులల్లో ఉన్నాయి. బిగ్ బాస్ ప్రేక్షకులకు ఎప్పుడు ఎప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ చేస్తారా అనే క్యూరియాసిటీ రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే అందరిలో ఉన్న సస్పెన్సు కి తెరతీస్తూ స్టార్ మా ప్రతిష్టాత్మకంగా బిగ్ బాస్ లోగోని విడుదల చేసింది. లోగో గత సీజన్ లో కంటే భిన్నంగా ఉంది. దీంతో బిగ్ బాస్ సీజన్-7 పై అంచనాలు తార స్థాయికి చేరాయనడంలో ఆశ్చర్యం లేదు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం అవుతున్న ఈ సీజన్ ఎంత మేరకు ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.