English | Telugu

బిగ్ బాస్ తర్వాత బజ్జీలేసుకుంటున్న శ్రీహన్ !

శ్రీహాన్.. బిగ్ బాస్ సీజన్‌-6 లో ఫైనల్ వరకు చేరుకొని ఒక్క అడుగు దూరంలో వెనుదిరిగి.. రన్నర్ గా నిలిచాడు. దీంతో శ్రీహాన్ కి క్రేజ్ విపరీతంగా పెరిగింది. బిగ్ బాస్ ముందువరకు శ్రీహాన్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు.. ఈ షోతో బాగా ఫేమస్ అయ్యాడు. శ్రీహాన్ నటుడే కాకుండా మంచి సింగర్ కూడా.

బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు రేవంత్, శ్రీసత్యలతో కలిసి ఉన్న శ్రీహాన్.. ప్రేక్షకులకి కన్నింగ్ మైండెడ్ లా అనిపించేది‌. ప్రతీసారీ ఇనయాని టార్గెట్ చేసి కావాలనే నామినేషన్లలో గొడవలు పెట్టుకున్నాడని స్పష్టంగా తెలిసింది. అయితే మరో పక్క శ్రీసత్యతో లవ్ ట్రాక్ కూడా నడిపాడని అనుకునేవారు లేకపోలేదు. ప్రతిసారీ శ్రీసత్యని హగ్ చేసుకోవడం‌.. గేమ్స్ లో తనకే సపోర్ట్ చేయడం.. మిగతావాళ్ళని శత్రువులను చూసినట్టు చూడటంతో బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకి సైతం తెలిసిపోయింది. ఫ్యామిలీ వీక్ లో.. తన గర్ల్ ఫ్రెండ్ సిరి వచ్చినప్పుడు కూడా శ్రీహాన్ కి కొన్ని టిప్స్ చెప్పింది. అందులో శ్రీసత్యతో జాగ్రత్తగా ఉండమని చెప్పింది సిరి.

శ్రీహన్, సిరి ఇద్దరు లవ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు. ఇద్దరు కూడా బిగ్ బాస్ కి వెళ్ళి ఫేమ్ సంపాదించినవాళ్ళే. శ్రీహన్ సోషల్ మీడియాకి కొంచెం దూరంగానే ఉంటాడు. తనకి సంబంధించిన ఏ అప్డేట్ అయినా ఫ్యాన్స్ వరకు వెళ్ళదు. అయితే శ్రీహన్ తాజాగా తన గర్ల్ ఫ్రెండ్ సిరికి మిర్చి బజ్జిలు చేసి ప్రేమతో అందించాడు. ఇలా చేసి ఇవ్వడాన్ని సిరి వీడియో చేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియో లో శ్రీహాన్ బజ్జీలు చేసి సిరికి ఇస్తే.. నాకోసం చేసావా అంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ లాగించేసింది.

శ్రీహాన్ సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించకుండా.. ఒకేసారి ఇలా బజ్జీలు వేస్తూ కనిపించడంతో.. తనని చూసిన నెటిజన్లు.. "పాపం శ్రీహాన్.. చివరికి బజ్జీలు వేసుకుంటున్నాడా" అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మరి శ్రీహాన్ నెటిజన్ల కామెంట్స్ కి చెక్ పెడుతూ.. ఏదైనా మూవీ అప్డేట్ గురించి తొందరగా చెప్తాడేమో చూడాలి మరి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.