Read more!

English | Telugu

నెరవేరిన జ్యోతక్క సొంతింటి కల!

సొంతింటి కల నెరవేరినప్పుడు ఎవ్వరికైనా ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. మరి తీన్ మార్ సావిత్రికి కూడా అలాగే ఉంది. తీన్ మార్ సావిత్రి అంటే చాలామంది మర్చిపోయి ఉంటారు. బిగ్ బాస్ జ్యోతక్క అంటే మాత్రం అందరికీ తెలుసు. ఆమె కొత్త ఇంటిని కట్టుకుని రీసెంట్ గా గృహప్రవేశం ఫంక్షన్ కూడా చేసుకుంది. శివ జ్యోతి బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. ఆమె అప్పట్లో బిగ్ బాస్ హౌస్‌లో ఒక  స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్నారు. ఏకంగా 14 వారాలు హౌస్ లో ఉండి తర్వాత  ఎలిమినేట్ అయ్యారు.  బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చాక ఆమె పాపులారిటీ డబుల్ ఐపోయింది. 

ఇక అప్పటినుంచి ఒక పక్కన ఈవెంట్స్, షోస్, సోషల్ మీడియా.. ఒకటేమిటి ఎక్కడ చూసినా జ్యోతక్కే. చాలా రోజులుగా హైదరాబాద్ లో శివజ్యోతి ఒక ఇంట్లో రెంట్ కి ఉంటున్నారు. ఇక ఈ సంవత్సరం ఎండింగ్ లో ఆమె సొంతింటి కల నెరవేరింది. ఇక జ్యోతక్క ఈ వేడుకకు నటి హిమజను ఇన్వైట్ చేసింది.

తీన్ మార్ సావిత్రి నూతన గృహ ప్రవేశానికి హాజరైన హిమజ ఈ విషయాన్ని తన ఫాన్స్ తో షేర్ చేసుకున్నారు. ఈ వీడియోను హిమజ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.  "మీరు కొత్త ఇల్లు కట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. కలలు నిజం కావాలంటే చెమట చిందించాలి, కష్టపడాలి.. అప్పుడే మ్యాజిక్ జరుగుతుంది.. కల నెరవేరుతుంది"  అని హిమజ కాప్షన్ పెట్టింది.