English | Telugu

బిగ్ బాస్ అంటే ఇష్టం అందుకే ఇది వేసుకున్న

బిగ్ బాస్ అగ్నిపరీక్షలో హోల్డ్ లో ఉన్న కామనర్స్ కి డేర్ ఆర్ డై లెవెల్ 1 లో టాస్కులు ఇస్తోంది శ్రీముఖి. ఇప్పుడు ఊర్మిళ వెర్సెస్ శ్రీజ మధ్య ఒక టాస్క్ పెట్టింది. "బిగ్ బాస్ సీజన్ 3 లో ఒకానొక టాస్క్ లో నేను ఈ బిగ్ బాస్ టాటూ వేయించుకున్నాను..కాబట్టి మీరు నుదిటి మీద ఐ యామ్ ఏ లూజర్" అని టాటూ వేయించుకోవాలి అని చెప్పింది శ్రీముఖి. దాంతో ఊర్మిళ వెంటనే "నేను వెళ్లి కూర్చుంటున్నాను. ఎందుకంటే నేను లూజర్ ని కాదు కాబట్టి" అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక శ్రీజ మాత్రం తాను వెనకడుగు వేయను అని టాటూ వేయించుకుంటాను అని చెప్పింది. "అంటే నుదుటి మీద జీవితాంతం కనిపించేలా ఐ యాం ఏ లూజర్ అని వేయించుకుంటావా" అని శ్రీముఖి అడిగింది. హా వేయించుకుంటాను..ఎక్కడైనా పర్లేదు నాకు అని శ్రీజ అనేసరికి ఇచ్చి పడేసింది అంటూ నవదీప్ అన్నాడు. ఇక శ్రీముఖి నీ పేరులోనే దమ్ము ఉంది అనుకున్నా కానీ నీలో కూడా చాల దమ్ముంది అంటూ అసలు విషయం చెప్పింది.

టాటూ నుదిటి మీద కాదు లూజర్ అని కూడా కాదు. చేతి మీద వేయించుకోవాలి అని చెప్పింది. ఇక స్టేజి మీదకు టాటూ వేసేవాళ్లను కూడా శ్రీముఖి పిలిచింది. ఇక శ్రీముఖి మళ్ళీ ట్విస్ట్ పెట్టింది. 'నువ్వు ఈ టాటూ వేయించేసుకున్నాక అసలు ఈ అగ్నిపరీక్ష నుంచి నువ్వు హౌస్ లోకి వెళ్లకపోతే" అని అడిగింది. "హా పర్లేదు. ఒక మెమరీగా ఉంటుంది నాకు..బిగ్ బాస్ కోసం నేను ఇంతదూరం వచ్చాను. ఎవరికీ రాని అవకాశం నాకు వచ్చింది కదా పెర్మనెంట్ గా. హ్యాపీగా వేయించుకుంటా " అని చెప్పింది శ్రీజ. టాటూ వేయించుకున్నా శ్రీముఖి చెయ్యెత్తి ఆ టాటూ చూపించింది. దాంతో శ్రీజ నాగార్జున గారు కూడా ఇలాగే చెయ్యెత్తి ట్రోఫీ ఇస్తారా ఫైనల్ గా అని అడిగింది. దాంతో అందరూ అబ్బా అన్నారు. ఇక అభిజిత్ ఐతే శ్రీజ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది అని ఫిజికల్ స్ట్రెంత్ చాలా ఉందంటూ చెప్పాడు. ఇక బిందు మాధవి ఐతే శ్రీజ ఆల్ ది బెస్ట్ ఎందుకంటే బిగ్ బాస్ 8 సీజన్స్ లో శ్రీముఖి, గీత మాధురికి మాత్రమే వేశారు. ఇద్దరూ ఫైనల్స్ వరకు వెళ్లారు. నీకు కూడా చాల ఫ్యూచర్ ఉంటుంది అని అనిపిస్తోందని చెప్పింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.