English | Telugu
అనుజా ప్రెగ్నెన్సీ న్యూస్ పై క్లారిటీ ఇచ్చిన అవినాష్
Updated : Sep 11, 2022
'జబర్దస్త్' కామెడీ షోతో పరిచయమయ్యాడు. తర్వాత 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. 'కామెడీ స్టార్స్' ద్వారా ఆకట్టుకుంటున్న వ్యక్తి ముక్కు అవినాష్. అవినాష్ గురించి పెద్ద పరిచయం అక్కరలేదు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు పెళ్ళెప్పుడు అన్న వాళ్ళ ప్రశ్నలకు అనుజాని పెళ్లి చేసుకుని చూపించాడు. ఇక ఇప్పుడు బుల్లి తెర మీద వస్తున్న షోస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు శ్రీముఖితో కలిసి డాన్సులు వేస్తూ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాడు.
ఐతే ఇప్పుడు అవినాష్ కి సోషల్ మీడియా మీద ఫన్నీ యాంగిల్ లో కోపం వచ్చేసింది. దీనికి కారణం తన భార్య ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో వార్తలు రావడమే. దీని మీద ఒక వీడియోలో అవినాష్ , అనుజా ఇద్దరు కలిసి క్లారిటీ ఇచ్చారు. " అనుజా నిన్ను పనులు చేయొద్దన్నానా..డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమన్నారు కదా అసలే నువ్వు ప్రెగ్నెంట్ " అంటూ వీడియో స్టార్టింగ్ లో చెప్పేసరికి అందరూ నిజమేనెమో అనుకుంటాం కానీ తర్వాత అసలు విషయం చెప్పారు.
"చాలా యూట్యూబ్ చానెల్స్ అనుజా ప్రెగ్నెంట్ అని, అవినాష్ తండ్రి కాబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. మేము ఫంక్షన్స్ కి వెళుతుంటే ఎన్నో నెల..ఈ గుడ్ న్యూస్ మాకు చెప్పలేదేంటి అని అనుజాని అడుగుతున్నారు. మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా ఫోన్స్ చేసి అడుగుతున్నారు. కనీసం ఈ విషయం తల్లితండ్రులకు కూడా చెప్పవా అంటూ మా అమ్మానాన్నలు కూడా ఫోన్ చేసి అడిగేసరికి మాకే షాకింగా అనిపించింది. మాకే తెలియని ఈ విషయం గురించి విన్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థంకాలేదు. అలాంటి గుడ్ న్యూస్ ఏదైనా ఉంది అంటే దాన్ని ముందుగా మీకే షేర్ చేస్తాం. ఎందుకంటే మీరే కదా మా ఫామిలీ మెంబెర్స్..ఈ న్యూస్ ఇలా స్ప్రెడ్ అయ్యేసరికి అనుజా బయటికి వెళ్లడం మానేసింది ఏం ఆన్సర్ ఇవ్వాలో తెలియక " అంటూ అవినాష్, అనూజ్ ఈ ప్రెగ్నెంట్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చేసారు.