English | Telugu
క్లాస్, మాస్ ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న అషు రెడ్డి!
Updated : May 11, 2023
అషు రెడ్డి.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న బ్యూటీ. బిగ్ బాస్ లోకి వెళ్ళకముందు అషు పెద్దగా పరిచయం లేని పేరు. బిగ్ బాస్ ఎంట్రీతో ఫేమ్ తో పాటు తనకంటూ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. ఆర్జీవీతో అషురెడ్డి కలిసి చేసిన ఒక వీడియో ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిన విషయమే. అప్పట్లో ఈ వీడియో గురించి నెటిజన్ల నెగటివ్ కామెంట్స్ తో పెద్ద డిబేటే జరిగింది. అంతేకాకుండా మరోసారి ఒక కాఫీ షాప్ లో అషురెడ్డి పొట్టి డ్రెస్ లో కూర్చొని ఉండగా.. ఆర్జీవీ తన థైస్ ని బాగున్నాయని అనగా, ఆమె చెంపమీద కొట్టడంతో ఆ ఇంటర్వ్యూ కూడా అప్పట్లో వైరల్ అయింది.
అషు రెడ్డి, కమెడియన్ పటాస్ హరితో సన్నిహితంగా ఉంటుంది. దాంతో ఇద్దరు లవ్ లో ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే అందులో నిజం లేదని కేవలం ఎంటర్‌టైన్మెంట్ కోసమనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత అషు రెడ్డి బిబి జోడి షో కోసం మెహబూబ్ తో కలిసి జోడి గా వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో వెళ్ళిపోయింది. అయితే ప్రస్తుతం తను సమ్మర్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది.
తాజాగా అషు అమెరికాలో కొన్ని రోజులు ఉంది. అక్కడ తనకి ఫుడ్ పెట్టేవారు కూడా లేరని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టేసరికి.. అక్కడ ఉన్న తన స్నేహితులు చికెన్ పచ్చడిని పంపించారంట. ఆ తర్వాత తను అక్కడ ఉన్నప్పుడు దిగిన కొన్ని హాట్ ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. వాటికి బోలెడు కామెంట్స్ వచ్చాయి. అలా సమ్మర్ వెకేషన్ లో అషు రెడ్డి హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తుంది. ఇక ఎక్కువగా పొట్టి డ్రెస్సుల్లో దర్శనమిచ్చే ఈ అమ్మడు.. తాజాగా డల్లాస్ లో ఉన్న తన ఫ్రెండ్ దివ్య హౌస్ వార్మింగ్ సెర్మనీకి చీరకట్టులో వచ్చి సందడి చేసింది. అయితే దానికి సంబందించిన ఫొటోలని షేర్ చేసింది. కాగా ఇప్పుడు అషు రెడ్డి పోస్ట్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.