Read more!

English | Telugu

మీ ఇంట్లో కరెంటు ఉందా ? అంటున్న అష్షు

అష్షు రెడ్డి అంటే చాలు సోషల్ మీడియాని షాక్ చేసే ఒక అందాల ఆటం బాంబు. ఎప్పుడూ కొత్తకొత్తగా కనిపిస్తూ కుర్రకారులు అలరిస్తూ ఉంటుంది. బుల్లితెర మీద ఈవెంట్స్ లో కనిపిస్తూ అలరిస్తూ ఉంటుంది. ఖాళీ ఉన్నప్పుడల్లా వాళ్ళ పేరెంట్స్ తో కలిసి రీల్స్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒక రీల్ చేసింది అష్షు.  "కరెంటు ఉంటేనే వెలుగు ఉంటది..కరెంట్ లేకపోతె చీకటైతది" అనే పాటకు వాళ్ళ ఫామిలీ మెంబర్స్ తో కలిసి డాన్స్ వేస్తూ వేయిస్తూ రీల్ చేసేసింది.

ఇక ఈ రీల్ కి "మీ ఇంట్లో కరెంటు ఉందా ? ఫైనల్ గా మా అమ్మతో కూడా రీల్ చేయించాను" అంటూ ఒక నవ్వే ఎమోజి పెట్టింది. రెగ్యులర్ గా తన  ఇన్‏స్టాలో సూపర్ హాట్ ఫొటోస్ తో కేకపెట్టిస్తుంటుంది బ్యూటీ.. ఇక అప్పుడప్పుడు తన ఫ్యామిలీ అకేషన్స్‏ను, ఫ్రెండ్స్ తో వెకేషన్స్ ని  కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంటుంది. ఇక అష్షు ఆర్జివి బ్యూటీగా పేరు తెచ్చుకుంది.

ఎప్పుడూ ఏదో ఒక హాట్ టాపిక్ తో న్యూస్ లో నిలుస్తూనే ఉంటుంది. నడుము మీద పవన్ కళ్యాణ్ పేరు రాయించుకుని, వాళ్ళ అమ్మకు కార్ గిఫ్ట్ గా ఇచ్చి, ఆర్జీవీతో కలిసి వెరైటీగా మూవీ ప్రమోషన్స్ చేస్తూ ఎప్పుడూ తనకో స్టైల్ ని క్రియేట్ చేసుకుంది..ఎలా ఉంటె లైం లైట్ లో ఉంటారు అష్షు రెడ్డికి బాగా తెలుసు. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ అప్ డేట్స్ తో ఎక్కువగానే కనెక్ట్ అవుతూ ఉంటుంది. "సూపర్, అంటీ బాగా చేశారు..ఆంటీ వేసిన స్టెప్ హైలైట్...ఫెంటాస్టిక్ " అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు.