English | Telugu

అందాల ఆరబోతలో తనేం తక్కువ కాదంటున్న ఆరోహి రావు!

నిన్న మొన్నటి దాకా సింపుల్ గా ఉంటూ అందరికి ట్రెడిషనల్ లుక్ లో‌ కన్పించిన ఆరోహి రావు.. డోస్ పెంచింది. అందచందాలతో మరో అడుగు ముందుకేసింది. బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేయడమే కాకుండా బోల్డ్ కంటెంట్ రాసుకొచ్చింది. "బి ఏ బ్యాడ్ బిచ్ అండ్ ఏ గుడ్ పర్సన్.. ఇట్స్ ఓకే టు బి బోత్ " అని క్యాప్షన్ రాసింది.‌ ఈ పోస్ట్ లో మొత్తంగా ఆరు ఫోటోలు పోస్ట్ చేసింది ఆరోహి. అందులో మొదటి, మూడు ఫోటోలలో మరీ ఎక్కువగా బోల్డ్ గా కన్పించేసరికి నెటిజన్లు ఆ ఫోటోల గురించి మాత్రమే కామెంట్ చేస్తున్నారు. ఇక నేను అందాలు ఆరబోస్తానంటు మస్త్ మస్త్ ఫోటోలని పోస్ట్ చేసేసింది ఈ బ్యూటీ.

ఆరోహీ రావు.. బిగ్ బాస్ సీజన్-6 తో అందరికి పరిచయమైంది. బిగ్ బాస్ హౌస్ లో సూర్యతో కలిసి ఎక్కువ సమయం గడిపిన ఈ భామ.. ఇనయా సుల్తానా, కీర్తభట్ లతో మొదట్లో మంచి స్నేహాన్ని కలిగి ఉండేది. అయితే సూర్యతో స్నేహం మొదలయ్యాక అందరిని పక్కన పెట్టేసి సూర్య ఎక్కడుంటే అక్కడ టైమ్ గడిపేది‌‌. ఆ రకంగా హౌస్ లో ఎంతో కొంత గుర్తింపు పొందింది ఆరోహి రావు.

బిగ్ బాస్ కి ముందు వరకు ఒక న్యూస్ ఛానెల్ లో పనిచేసిన ఆరోహి.. తన యాస మాటలతో పాపులారిటి తెచ్చుకుంది. తెలంగాణ పరకాలలోని కనపర్తి అనే గ్రామంలో పుట్టింది అంజలి అలియాస్ ఆరోహి రావు. వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఉన్నా లేనట్టే అని చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే వాళ్ళ నాన్న తనని చిన్నప్పుడే వదిలిపెట్టాడని ఆరోహి చెప్పుకొచ్చింది. వరంగల్ లోని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి ఎంబిఏ వరకు చదివిన ఆరోహి.. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. దాంతో తను క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అనాథగా అడుగుపెట్టిన ఆరోహి.. హౌస్ లోకి వచ్చాక అందరితో మాట్లాడుతూ సరదాగా గడిపింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.