English | Telugu

వాళ్లు ఆంటీ అంటే ఆ అర్థాలు వేరు అంటున్న అనసూయ!

అనసూయ భరద్వాజ్.. యాంకర్ గా కెరీర్‌ మొదలుపెట్టి నటిగా రాణిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 'రంగస్థలం' లో రంగమ్మత్త క్యారెక్టర్ నుండి తాజాగా విడుదలైన 'రంగ మార్తాండ' వరకు తన నటనను ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది అనసూయ.

అయితే తనని ఎవరైనా ఆంటీ అంటే దానికి గట్టిగా రియాక్ట్ అయ్యే అనసూయ.. ఆ మాట వింటే అంతలా కోపం రావడానికి కారణమేంటో చెప్పింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటున్న ఈ భామ ఆదివారం సెలవు దొరకడంతో తన ఇన్ స్టాగ్రామ్ లో ప్రేక్షకులతో చిట్ చాట్ చేసింది. 'లెట్స్ చాట్.. I have about 45 Mints .. What's up ' అంటూ తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేయడంతో అనసూయ అభిమానులు ప్రశ్నలతో ముంచెత్తారు. దీంతో అనసూయ వీలైనంతవరకు రిప్లై ఇచ్చింది. మొదట ఒక అభిమాని 'అక్క మిమ్మల్ని ఎవరైనా ఆంటీ అంటే ఎందుకు అంత కోపం వస్తుంది' అని అడుగగా.. ఎందుకంటే వాళ్ళ అర్థాలు వేరే ఉంటాయి కాబట్టి.. అది వాళ్ళ కర్మకే వదిలేస్తున్నా.. నాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయని సమాధానమిచ్చింది. "సండే స్పెషల్ ఏంటి మేడమ్" అని ఒక అభిమాని అడుగగా.. అమ్మ చేసిన మామిడికాయ పప్పు, ఆలు ఫ్రై చుక్క కూర పచ్చడి అని అనసూయ సమధానమిచ్చింది. "కొత్త మూవీ అప్డేట్ ఏదైనా?" అని ఒక అభిమాని ప్రశ్నించగా.. ఎస్ ఉంది.. ఏప్రిల్ మధ్యలో మొదలవుతుంది. ఒక గొప్ప డైరెక్టర్ తో కలిసి చేస్తున్నాను.. మొత్తం అప్డేట్ కోసం ఆగాల్సిందేనని సమాధానమిచ్చింది. సండే కదా ఏమైనా సినిమా చూస్తారా? అని మరొకరు అడుగగా.. ఎస్ ... పిల్లలతో కలిసి 'మెజిషియన్స్ ఎలిఫెంట్' చూడాలనుకుంటున్నానని సమాధానమిచ్చింది.

మీరు చాలా మందికి ఇన్సిపిరేషన్.. మీరు ఇలా సైలెంట్ గా ఉంటే ఏం బాలేదని ఒకరు అడుగగా.. నేను సైలెంట్ గా లేను.. రూట్ మార్చాను.. అయినా నేను మాట్లాడాలనుకుంటే నన్ను నేనే ఆపలేను అని అనసూయ చెప్పింది. మీరు నా టీనేజ్ క్రష్ మేడమ్.. సండే సెల్ఫీ ప్లీజ్ అని అడుగగా.. తన సెల్ఫీ ఫోటోని అప్లోడ్ చేసింది. ఈరోజు వెజ్ ఆర్ నాన్ వెజ్ అని ఒక అభిమాని అడుగగా.. నిన్న, ఈరోజు, రేపు ఏ రోజైనా తినేది వెజ్ తింటాను.. ఎందుకంటే నేను వెజిటేరియన్ ని అని బదులిచ్చింది. ఇలా తనకు సంబంధించిన కొన్ని విషయాలను తన అభిమానులతో పంచుకుంది అనసూయ.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.