English | Telugu

వీళ్లంతా నా పిల్లలు కారు స్టార్ మా పిల్లలు అన్న శ్రీముఖి

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" షో ఇప్పటివరకు సీరియల్స్ లో సెలబ్రిటీస్ తో గేమ్స్ ఆడిస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. అసలే సమ్మర్ సీజన్.. పిల్లలందరికీ స్కూల్, కాలేజీ హాలిడేస్ ఇచ్చేసారు. ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలాంటి చిల్డ్రన్స్ కోసం స్టార్ మా పరివారం టీం అంతా కలిసి "కిడ్స్ స్పెషల్" అంటూ ఒక ప్రోగ్రాంని రూపొందించారు. ఇందులో స్టార్ మా సీరియల్స్ లో నటించే చిన్నారులందరినీ తీసుకొచ్చి ఈ షోలో గేమ్స్ ఆడించారు. ఇక హోస్ట్ శ్రీముఖి ప్రతీ వారం కలర్ ఫుల్ గా కనిపించే పొట్టి డ్రెస్సుల్లో వచ్చేది. కానీ ఈ వారం చాలా పద్దతిగా కాటన్ శారీలో కనిపించి అలరించింది. "ఎప్పుడూ పాలేరులను వాళ్లనేనా పిలిచేది మాలాంటి కిడ్స్ ని పిలవకుండా సమ్మర్ స్పెషల్ షో ఎలా చేస్తావ్" అని అడిగారు. ఇక మధురానగరిలో కనిపించే బుడ్డోడు కూడా ఈ షోలో కళ్ళఅద్దాలు పెట్టుకుని వచ్చాడు. "అరే బుడ్డోడా కళ్లద్దాలు తీసి నాకు కన్ను కొట్టు" అని అడిగింది శ్రీముఖి.

అవినాష్ అంకుల్ వచ్చాడు అంటూ శ్రీముఖి చెప్పేసరికి "ఈమధ్య పెళ్లయిపోయింది పిల్లలు కూడా" అని అవినాష్ శ్రీముఖిని చూస్తూ అనేసరికి కోపంతో "ఎక్స్క్యూజ్ మీ..వీళ్లంతా నా పిల్లలు కారు స్టార్ మా పిల్లలు" అంది. "మీరు మమ్మల్ని కొట్టేంత పెద్దవాళ్ళు ఇపోయారా" అని ఎక్స్ప్రెస్ హరి అనేసరికి "మేము పెద్దోళ్ళం కాదు పిల్లలం అందుకే కిడ్స్ స్పెషల్ కి వచ్చాం" అని చెప్పేసరికి "చూసారా అమ్మగారు పిల్లలు కూడా పంచులు వేస్తున్నారు" అని అన్నాడు. "పిల్లలు పంచులు వేస్తున్నారు కానీ నువ్వు అవి కూడా వేయట్లేదుగా" అంది శ్రీముఖి. ఇంతలో ఫైమా లంగాజాకెట్టు వేసుకుని చిన్నపిల్లలా వచ్చింది. "పిల్లలకు ఆయా ఉంటే బాగుండు అనుకున్నాను వచ్చేసింది" అని అన్నాడు అవినాష్. దానికి పిల్లలకు కోపం వచ్చింది.."మేమంతా ఒక గ్రూపు..ఆ గ్రూపుకు ఫైమా అక్క తోపు" అనేసరికి పిల్లలంతా గట్టిగా అరిచారు. ఇక మధునాగరిలో చైల్డ్ రోల్ లో చేస్తున్న ఆదిత్య వచ్చి "నేను పోలీస్ అవ్వను ఆర్మీలోకి వెళ్తాను" అనేసరికి శ్రీముఖి గట్టిగా అరిచింది. రొటీన్ స్టైల్లో కాకుండా కిడ్స్ స్పెషల్ ఈ వారం సంథింగ్ స్పెషల్ గా రాబోతోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.