English | Telugu

వీళ్ళిద్దరి మధ్యలో నరకం చూస్తున్నా : ఆదిరెడ్డి 

ఎవరా ఇద్దరు? ఏంటా కథ.‌. అసలు ఆదిరెడ్డికి నరకమా ఇదేందయ్యా ఇది అనేగా.. ఎస్ నిజమే ఆదిరెడ్డికి ఇంట్లో కష్టంగా ఉందంటూ చెప్పసాగాడు. ఆ విషయాన్ని కవిత నాగ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశారు. అదేంటో ఆ నరకమేంటో ఓసారి చూసేద్దాం...

ఆదిరెడ్డి వాళ్ల చెల్లెలు, నాన్న, కవిత అందరు కలిసి ఒకే ఉంట్లో ఉంటారు. వారిమధ్య ఇప్పటివరకు ఏ గొడవ జరుగలేదు. తాజాగా ఓ వ్లాగ్ ను వారి యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయడంతో ఆసక్తిగా మారింది. బిగ్ బాస్ సీజన్ 6 కి ముందు ప్రతీ ఎపిసోడ్ చూసి రివ్యూలు ఇచ్చిన అదిరెడ్డి.. కామన్ మ్యాన్ కేటగిరీలో సీజన్ సిక్స్ లో హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఎన్నో అంచనాల మధ్య కామన్ మ్యాన్ కేటగిరీలో అడుగుపెట్టిన ఆదిరెడ్డికి బయట బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పడింది. హౌస్ లో జెన్యున్ ప్లేయర్ అంటే ఆదిరెడ్డి అనేంతలా తన ఆటతీరుని కనబరిచేవాడు. అలాగే గీతురెడ్డితో స్నేహం అతనికి కాస్త కలిసొచ్చింది. తన స్ట్రాటజీలు ఇతర కంటెస్టెంట్స్ మీద చూపించే గీతు రాయల్.. ఆదిరెడ్డి మీద చూపించేది కాదు. అదొక ప్లస్ అవ్వగా.. ప్రతీ నామినేషన్ లో వ్యాలిడ్ రీజన్ లు చేప్తూ ఆడియన్స్ ఇలా అనుకుంటారు. ఇది కరెక్ట్.. మనం ఇలానే ఉండాలని అనుకుంటు మరింత ఫెయిర్ ప్లే గేమ్ ఆడాడు. ఇక సీజన్ సిక్స్ లో టాప్- 4 కంటెస్టెంట్స్ లలో ఒకడిగా ఉండి ఎలిమినేషన్ అయి బయటకొచ్చాడు ఆదిరెడ్డి.

కరోన టైమ్ లో ఆదిరెడ్డి చెల్లెలు నాగలక్ష్మి తన పెన్షన్ డబ్బుని సోను సూద్ కు పంపించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఆదిరెడ్డి వెళ్ళి అక్కడ కామన్ మ్యాన్ పవర్ చూపించాడు. హౌస్ లో ఆడే ప్రతీ టాస్క్ ప్రాణం పెట్టి ఆడేవాడు. బిగ్ బాస్ సీజన్ సిక్స్ తర్వాత సీజన్ సెవెన్ కు రివ్యూ లు ఇచ్చి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చెల్లి నాగలక్ష్మి, భార్య కవితకు మధ్య గొడవ జరిగిందని దానివల్ల తను ఇబ్బంది పడుతున్నాడని చెప్పుకొచ్చాడు. ‌ఇలా ప్రతీ ఇంట్లో ఉంటుంది .. దయచేసి భర్తలను అర్థం చేస్కోండి అంటు ఆదిరెడ్డి ఈ వ్లాగ్ లో చెప్పాడు. కవిత నాగ వ్లాగ్ అనే యూట్యూబ్ ఛానెల్ లో .. " వీళ్ళ ఇద్దరి మధ్యలో నరకం చేస్తున్నా " అనే టైటిల్ తో ఈ వ్లాగ్ ని అప్లోడ్ చేశారు. ఇకనుండి నాగలక్ష్మి తన పెన్షన్ డబ్బులు తీసుకోవద్దని నేను చూసుకుంటానని చెప్పాను కదా అని ఆదిరెడ్డి చెప్పగా నాగలక్ష్మి వద్దని అంది. మరి ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అనే క్వశ్చన్ వేసి నెటిజన్లని జవాబులు చెప్పమనగా ఈ వీడియోకి కామెంట్లతో పాటు అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.