English | Telugu

బోల్డ్ క్యారెక్టర్స్ చేసినా ఇబ్బంది ప‌డ‌లేదు.. 'కార్తీక‌దీపం' న‌టి!

'కార్తీకదీపం' సీరియల్ లో అర్ధపావు భాగ్యం క్యారెక్టర్ పోషిస్తోన్న నటి ఉమ తన పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. సీరియల్‌లో ఆమెతో చేయించే కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తోంది. ప్రస్తుతం సీరియల్స్ తో బిజీగా ఉన్న ఈ నటి ఒకప్పుడు సినిమాల్లో కూడా నటించింది. కొన్ని బోల్డ్ క్యారెక్టర్స్ లో కూడా కనిపించింది. ఈమె ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఇండస్ట్రీలో తనకు ఎదురైన సవాళ్లను, అనుభవాల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. సినిమా, టీవీ ఇండస్ట్రీలో నటించాలంటే ఇబ్బందులు వస్తాయని అనుకుంటే.. ఎక్కడైనా ఇబ్బందే అని.. ఇబ్బంది ఉండదు అనుకుంటే ఎక్కడా ఉండదని చెప్పింది.

పనికోసం చాలా మంది ఎన్నో విధాలుగా ఎదురుచూస్తున్నారని.. మనం కావాలనుకున్న పని దొరికినప్పుడు దైవంగా భావించి చేస్తే ఎలాంటి ఇబ్బంది కనిపించదని చెప్పుకొచ్చింది. ఇన్నాళ్ల తన కెరీర్‌లో ఇప్పటివరకు ఇబ్బందిగా ఫీలైన సందర్భం లేదని చెప్పింది. ఎదుటివారితో ఇష్టంగా, ప్రొఫెషనల్ గా నటించాలని.. లేదనుకుంటే ఇంట్లో కూర్చోవాలని చెప్పుకొచ్చింది. తనకైతే ఇండస్ట్రీలో ఎలాంటి చెడు అనుభవం ఎదురుకాలేదని.. ఎవరి వలన ఇబ్బంది పడలేదని స్పష్టం చేసింది.

తను బోల్డ్ పాత్రల్లో నటించినప్పుడు కూడా పెద్ద ఇబ్బందులు రాలేదని.. ఒక ఆర్టిస్ట్ తన కెరీర్‌ని ప్రొఫెషనల్‌గా భావించినప్పుడు ఎలాంటి పాత్రలో అయినా నటిస్తాడని.. తను కూడా అంతేనని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు ఈ క్యారెక్టర్ ఎందుకు చేశానని ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది. మంచి తొందరగా వెళ్లదు.. చెడు తొందరగా వెళ్తుందని చెప్పడానికి తను చేసిన బోల్డ్ పాత్రలే ఉదాహరణ అని చెప్పింది. తను చాలా తక్కువగా బోల్డ్ పాత్రలు చేశానని.. కానీ ఇప్పటికీ వాటి గురించే చెప్పుకుంటారని వెల్లడించింది. భవిష్యత్తులో తనకు పిచ్చిదాని క్యారెక్టర్ చేయాలని ఉందని.. అందులో వైవిధ్యాన్ని ప్రదర్శించాలనుందని చెప్పుకొచ్చింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.